Take a fresh look at your lifestyle.

ఉద్యోగాలడిగితే నాడు తలుపులు పలగ్గొట్టినవ్.. ‌నేడు నీ గడీని బద్దలు కొడుతాం.. కాస్కో!

నల్లగొండ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ  అభ్యర్థి ప్రొ . కోదండరామ్
నామినేషన్ దాఖలు  
నల్లగొండ,ఫిబ్రవరీ 22: పదవుల  కోసం వస్తలేం ప్రజాస్వామ్య పరిరక్షణకు వస్తున్నాం.. ఉద్యోగాలడిగినప్పుడు నువ్వు నా ఇంటి తలువులు బద్దలు గొట్టినవ్ ..ఇప్పుడు నేను నీ గడీ ని బద్దలు గొట్టడానికి వొస్తున్న అని ముఖ్యమంత్రి కె సి ఆర్ ను ఉద్దేశించి ప్రొ .కోదండరామ్ అన్నారు.
నల్లగొండ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ  స్థానానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ .కోదండరాం సోమవారం నల్లగొండ లో నామినేషన్ దాఖలు చేసారు .అనంతరం పట్టబద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ  కోదండరామ్ ..తెరాస గెలిస్తే వాళ్లకే పనులయితయ్.. యూనివర్సిటీ లు బందయితయ్… ప్రైవేటు యూనివర్సిటీ లు నిలబడతయ్ అని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలు మూతబడి ..కార్పోరేట్ వ్యవస్థ లు బలపడతాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.యస్ సి,బిసి యస్టీ కార్పోరేషన్ లో ఋణాలు మంజూరు లో నిర్లక్ష్యం జరిగిందనీ ..ఉద్యోగాల భర్తీ లేదు..పిఆర్సి లేదు.. ఎప్పుడూ పీఆర్సీ వచ్చిన జీతం పెరుగుతుంది,కానీ ఈసారి తగ్గిందని అన్నారు.
ఎల్ ఆర్ ఎస్ తో  తో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందన్నారు.పదవుల  కోసం వస్తలేం ప్రజాస్వామ్య పరిరక్షణకు వస్తున్నాం.  అంబేద్కరే ఆదర్శం బోధించు,సమీకరించు,పోరాడు అన్న నినాదమే మా దారి ..ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వో టు వేయాలని  ప్రొ .కోదండరామ్ విజ్ఞప్తి చేసారు. నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో   అభ్యర్ధి ప్రో కోదండరామ్ తో పాటు  టీజస్ పొలిటికల్ అఫైరీస్ కమిటీ పంజాగుల శ్రీశైలరెడ్డి, టీజస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మర్జున్ , బైరి రమేష్, గోపాగాని శంకర్ రావు, సీ పీ ఐ  ఎం ఎల్ న్యూడెమోక్రాసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, నల్లగొండ జిల్లా కార్యదర్శి రాయి క్రిష్ణ, ఆవుల అశోక్  ,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు రతన్ రావ్ , నిజ్జన రమేష్, సలీం పాషా, తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సూర్యపేట జిల్లా అధ్యక్షులు గట్ల రమశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు మండ్ర మల్లయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతిరెడ్డి శ్రీనివాస రెడ్డి,  పీ డీ ఎస్ యు  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరి సాగర్, ఓయూ ,కెయు  జె ఏ సీ  నేతలు దుర్గం సారయ్య, సర్దార్ వినోద్ కుమార్ ,నునావత్ రవీందర్, బాషబోయిన వేణురాజ్ , అనిల్ ,సాయి,బిక్షం, అంజి,  భాస్కర్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply