Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి..

ఇటీవల రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగులు మృతి చెందారు. 63శాతం గాయాలతో ఉస్మానియా దవాఖాన లో చికిత్స పొందుతూ  శనివారం 3.15గంటల సమయంలో మరణించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు (55) జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఈ నెల 10న ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.అక్కడే ఉన్న పోలీసులు అతడిని 

హాస్పిటల్ కి తరలించారు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగడంలేదని అతడు ఆవేదన వ్యక్తచేశాడు. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన నాగులు ఏడేళ్లుగా హైదరాబాద్‌ పంజాగుట్ట ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నానని కొంతకాలంగా దిగులు చెందుతున్నాడు.ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంతంలో తాను ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వమే తన పిల్లల్ని చదివిస్తుందని భావించారు. పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో శరీరాన్ని మంటలు అంటుకున్నా జై తెలంగాణ, జై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశాడు.

Leave a Reply