Take a fresh look at your lifestyle.

రైతుల ఆత్మహత్యాయత్నం నాగర్‌కర్నూల్‌ ‌కలెక్టరేట్‌ ‌వద్ద ఉద్రిక్తత

నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద పలువురు రైతులు కిరోసిన్‌ ‌పోసుకుని సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జట ప్రోలు గ్రామానికి చెందిన 11మంది  శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌ముంపు బాధితులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ‌కార్యాలయం భవనం పైకి ఎక్కి మాకు న్యాయం చేయాలంటూ కిరోసిన్‌ ఒం‌టి పైన పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. దాదాపు గంటకు పైగా కలెక్టరేట్‌ ‌కార్యాలయం భవనంపైననే ఉండి నిరసన తెలిపారు.కాగా వారి కుటుబ సభ్యులు కలెక్టరేట్‌ ‌కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. చివరకు కలెక్టర్‌ ‌న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో భవనం పై నుండి కిందకు దిగివచ్చారు.కలెక్టర్‌ ‌తమ చాంబర్‌ ‌కు తీసుకెళ్లి వారి సమస్యలు విన్నారు.
ఈ సందర్భంగా భాదితులు కలెక్టర్‌ ‌కు తమ సమష్యను వివరించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన రైతులు  శ్రీ శైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌కు ముంపుకు గరైనప్పుడు అదే మండలానికి చెందిన గోపులాపూర్‌ ‌గ్రామ శివారులో తాము వడ్డెమాన్‌ ‌మాసన్న  అనే వ్యక్తి వద్ద నుండి1994 సంవత్సరంలో 177 సర్వే నంబర్‌ ‌గల రెండున్నర ఎకరాల భూమిని  కొనుగోలు చేసి ఆభూమిలో పశువుల మేతను భద్ర పరుచు కుంటున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు మాసన్న కుటుంభం చనిపోయిన తరువాత ఇప్పుడు రాయలసీమ లో ఉంటున్న  మాసన్న అల్లుడు లక్ష్మయ్య ఆ భూమి మేము అమ్మ లేదు అని, ఆ భూమి మాదే అంటూ కబ్జా చేసుకునీ  మండల తహశీల్దార్‌ ‌సహాయం తో ఆభూమి నుండి మమ్మల్ని బలవంతంగా వెల్లగొట్టాడని , మా పై దౌర్జన్యం చేస్తున్నాడని భాదిత రైతులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మండల తహశీల్దార్‌ ‌కు పిర్యాదు చేసినా మరియు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కలెక్టర్‌ ‌కార్యాలయం పైకెక్కి కిరోసిన్‌ ‌పోసుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని అన్నారు. తహశీల్దార్‌ ‌భూమిని 1880 సంవత్సరం లో ఎస్సీలకు  అసైన్మెంట్‌ ‌చేయడం జరిగిందనీ , తాహసిల్దార్‌ ‌రెవిన్యూ పరంగా ఆ సైడ్‌ ‌చేశామని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ‌తీసుకొని రమ్మని కబ్జా చేసిన వారికి అనుకూలంగా మాకు  నోటీసులు కూడా ఇచ్చారని  బాధితులు ఆచారు. ఇరువురిని పిలిపించి అర్హులైన వారికి న్యాయం చేస్తానని కలెక్టర్‌ ‌హామీ ఇవ్వడం తో భాదిత రైతులు ఆందోళన విరమిచుకున్నారు. ముందు జాగ్రత్తగా కలెక్టర్‌ అగ్నిమాపక  వాహనం మరియు వైద్య సిబ్బందిని పిలిపించారు. ఈ నిరసనలో శంకరయ్య, గోపాల్‌, ‌నందిని, పెంటయ్య, వెంకటస్వామి, రాములు, సుశీలమ్మ, సత్యనారాయణ, రాముడు, గోవిందు పాల్గొన్నారు.

Leave a Reply