Take a fresh look at your lifestyle.

నాగార్జునసాగర్ బై ఎల‌క్ష‌న్ షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 17 పోలింగ్, మే 2న ఫలితం.

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,మార్చి 16: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ(గ్రాడ్యువేట్ కాన్సిటెన్సీ) ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడవక ముందే, మరో సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహారెడ్డి(టీఆర్ఎస్ ఎమ్మెల్యే) మరణంతో ఖాళీ అయిన నాగర్జునసాగర్ సీటుకు ఎన్నిక సీఈసీ తేదీనికి ఖారారు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ మార్చి 23న విడుదల చేయనున్నట్టు తెలిపింది. మార్చి 30న‌ నామినేషన్ల స్వీకరణకు చివరి తేది, మార్చి 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3న నామినేషన్ల ఉప‌సంహ‌ర‌ణ‌కి అవకాశం కల్పించినట్టు ఈసీ(ఎల‌క్ష‌న్ షెడ్యూల్‌) పేర్కొంది.

ఏప్రిల్ 17 న పోలింగ్, మే 2 ఫలితాలు వెలువరించనున్నట్టు పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 26 ప‌శ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఖాళీ స్థానాల్లోనూ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా ఉంది.

తెలంగాణలోని నాగర్జునసాగర్ తో సహా… దేశవ్యాప్తంగా 2 లోక్ సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఒకే షెడ్యూల్ ని ప్రకటించింది. ఇందులో తిరుపతి(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), బెల్గం(కర్ణాటక) పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, నాగర్జునసాగర్ (తెలంగాణ), మోర్వా హడఫ్( గుజరాత్), మధుపూర్ (జార్ఖండ్), బసవ కళ్యాణ్(కర్ణాటక), మస్కీ(కర్ణాటక), డమోహ్(మధ్య ప్రదేశ్), పదర్ పూర్(మహారాష్ట్ర), సెర్కిప్(మిజోరాం), నొక్ సేన్(నాగాలాండ్), పీపీలి(ఒడిశా), సహార(రాజస్థాన్), సుజన్ ఘర్(రాజస్థాన్), రజ్ సమండ్(రాజస్థాన్), సాల్ట్(ఉత్తరఖండ్) అసెంబ్లీ స్థానాల్లో ఒకే సారి పోలింగ్ జరగనుంది.
నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా ఉంది.

  • నోటిఫికేషన్ : మార్చి 23
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 30
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 31
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 3
  • పోలింగ్ : ఏప్రిల్ 17
  • మే 2న ఫలితాలు.

Leave a Reply