Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు మోగిన నగారా

  • నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్‌ ‌విడుదల
  • డిసెంబర్‌ 1‌న ఎన్నికలు..4న కౌంటింగ్‌, ‌ఫలితాల వెల్లడి
  • 22న గుర్తుల కేటాయింపు.. నేటి నుండి ఎన్నికల కోడ్‌
  • ‌మేయర్‌గా జనరల్‌ ‌మహిళకు రిజర్వేషన్‌
  • అసెంబ్లీ వోటరు జాబితాతో పాత డివిజన్ల మేరకే ఎన్నికలు
  • ఇవిఎంల స్థానంలో బ్యాలెట్‌ ‌పత్రాల ద్వారా వోటింగ్‌
  • ‌డియా సమావేశంలో ప్రకటించిన కమిషనర్‌ ‌పార్థసారథి
  • 20 వరకు నామినేషన్లు.. 24 వరకు ఉపసంహరణ

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సి) ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి సి.పార్థసారధి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1‌న బల్దియా ఎన్నికలు జరుగనున్నాయి. 4న వోట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుంచి ఈనెల 20 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. కాగా ఈసారి జీహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌పదవిని జనరల్‌ ‌మహిళకు కేటాయించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పార్థసారధి నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. 2021 ఫిబ్రవరితో జీహెచ్‌ఎం‌సి ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుందని తెలిపారు. 2016 రిజర్వేషన్ల చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిదులతో చర్చించి వోటర్ల జాబితాపై తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మంగళవారం నుండి నామినేషన్ల ప్రక్రియతో మొదలయి డిసెంబర్‌ 1‌న పోలింగ్‌, ఉదయం 7।।గంల నుండి 6గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఎదైనా జరిగితే 3న రిపోలింగ్‌ ‌నిర్వహించి, 4న క
ంటింగ్‌ అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఈ నెల 21న పోలింగ్‌ ‌స్టేషన్లను ఫైనల్‌ ‌చేస్తామని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు త్పవన్నారు. జనరల్‌ ‌పర్యవేక్షణకోసం ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఎఎస్‌ అధికారి, మొత్తంగా 30 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తామన్నారు.  ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు బందోబస్లు విషయంపై డీజీపీ, హైదరాబాద్‌ ‌సీపీతో చర్చించామన్నారు. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో ఈసారి ఎన్నికలను బ్యాలెట్‌ ‌పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. పోలింగ్‌కు 55 వేల మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామనీ, బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌తెలుపు రంగులో ఉంటుందనీ పార్థసారధి వివరించారు.

ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ
అభ్యర్థి వ్యయం రూ.5 లక్షలకు మించవద్దనీ, ఫలితాలు వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చును సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రేటర్‌లో 257 క్రిటికల్‌, 1,004 అత్యంత సమస్యాత్మక, 1439 సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలను గుర్తించామనీ, వెల్డడించారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో 2009లో 42.04 శాతం, 2016లో 45.29 శాతం పోలింగ్‌ ‌నమోదైందని వివరించారు. ఈసారి పోలింగ్‌ ‌మరింత ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉందనీ, ఈ విధంగా ప్రజలకు అవగాహన కలిగించనున్నట్లు చెప్పారు. ఎన్నికలలో ఖర్చు చూపని అభ్యర్థులను 3 ఏళ్ల పాటు అనర్హులుగా ప్రకటిస్తామనీ, ఎన్నికలలో పోటీ చేసే బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు రూ.2,500, జనరల్‌ అభ్యర్థులు రూ. 5000 చొప్పున డిపాజిట్‌ ‌చెల్లించాలని చెప్పారు. ఎన్నికల డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లో సైతం చెల్లించవచ్చనీ, నామినేషన్లను సైతం ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, జీహెచ్‌ఎం‌సిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, వాటి రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌పదవి మహిళ (జనరల్‌), ఎస్టీ 2 (జనరల్‌ 1, ‌మహిళ 1), ఎస్సీ 10 (జనరల్‌ 5, ‌మహిళ 5), బీసీలు 50 (జనరల్‌ 25, ‌మహిళ 25), జనరల్‌ ‌మహిళ 44, జనరల్‌ 44.‌గా ఉన్నాయి.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను నేటి నుంచి స్వీకరించనున్నారు. రిటర్నింగ్‌ అధికారుల ద్వారా వార్డు సభ్యుల ఎన్నికలకు నోటీసు జారీ చేస్తారు. గ్రేటర్‌లో మొత్తం 74, 04,286 వోటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38,56,770, మహిళలు 35,46,847 ఇతరులు 669 ఉన్నారు. మొత్తం 150 వార్డులకు గాను 9248 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం సమస్యాత్మకంగా గుర్తించిన కొన్ని పోలింగ్‌ ‌కేంద్రాలలో వోటర్లను ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌విధానం ద్వారా గుర్తించనున్నారు. కాగా, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో 79,290 మంది వోటర్లతో అతి పెద్ద డివిజన్‌గా మైలార్‌దేవిపల్లి ఉండగా, అతి చిన్న డివిజన్‌గా రామచంద్రాపురం 27,948 మంది వోటర్లతో ఉంది.

Leave a Reply