Take a fresh look at your lifestyle.

నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా నూతన కలెక్టర్‌గా ఎల్‌ ‌శర్మన్‌ ‌చౌహన్‌

  • గర్భిణీ మహిళా అవసరాన్ని గుర్తించి రక్తదానం చేసిన కలెక్టర్‌
  • ‌జిల్లా ఆసుపత్రిలో కోవిడ్‌ ‌వార్డు సందర్శన
  • ప్రభుత్వాసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాలి – జిల్లా కలెక్టర్‌ ఎల్‌. ‌శర్మన్‌ 

‌నాగర్‌ ‌కర్నూల్‌,‌జులై 17. ప్రజాతంత్ర విలేకరి: నాగర్‌ ‌జిల్లాకు నూతన కలెక్టర్‌ ‌గా ఎల్‌ ‌శర్మన్‌ ‌గురువారం సాయంత్రం కలెక్టరేట్‌  ‌చాంబర్లో బాధ్యతలు చేప ట్టారు.అనంతరం  జిల్లాస్థా యి అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అధికారులు పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలన్నారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి అభివృద్ధి అంశాల గురించి చర్చిస్తానని పేర్కొన్నారు.అనంతరం డీఎంహెచ్‌ఓ ‌సుధాకర్‌ ‌లాల్‌ ‌తో జిల్లాలో కరోనా కేసును వివరాలపై సమీక్షించారు.పాజిటివ్‌ ‌కేసుల కు అందిస్తున్న చికిత్సలపై పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్‌ ‌శర్మన్‌ ఆదేశించా రు.కొత్త కలెక్టర్‌కు అన్ని శాఖల జిల్లా అధికా రులు పుష్పగుచ్ఛాలు సమర్పించిపరిచయం చేసుకున్నారు.

గర్భిణీ మహిళా అవసరాన్ని గుర్తించి రక్తదానం చేసిన కలెక్టర్‌

శుక్రవారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని నూతన కలెక్టర్‌ ఎల్‌ ‌శర్మన్‌  ‌సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా వైరస్‌ ‌బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ ‌వార్డును పరిశీలించారు. ఐసోలేషన్‌ ‌వార్డులో మంచాలు, బెడ్‌ ‌షీట్లు, ఐసీయూ వార్డు, స్నానపు గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఐసోలేషన్‌ ‌వార్డు, ఐసీయూ వార్డులకు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా ఆసుపత్రి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ ‌శర్మన్‌  ‌బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జిల్లా ఆస్పత్రిలో మొదట జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్‌ ‌సందర్శించి ఐసోలేషన్‌ ‌లో  చికిత్స పొందుతున్న తొమ్మిది మంది కరోనా పేషంట్లను దూరంనుండి పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు.అలాగే వారికి అందుతున్న వైద్య సదుపాయాల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ ‌కు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం ఆసుపత్రి విభాగంలోని పలు విభాగాలను పరిశీలించారు.

అనంతరం ఓ గర్భిణీ మహిళ ఆపరేషన్‌ ‌కు సిద్ధంగా ఉండటం ఆమెకు ఓ నెగటివ్‌ ‌రక్తం అవసరం ఉండటంతో  బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌లో లేకపోవడంతో తనే స్వయంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుని రక్తాన్ని దానం చేశారు.అనంతరం వైద్యులతోమాట్లాడుతూ కరోనా రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా సోకిన వారికి మనోధైర్యాన్ని అందించాలని వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందజేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ‌సుధాకర్‌ ‌లాల్‌, ఆసుపత్రి సూపరిండెంట్‌ ‌డాక్టర్‌ ‌ప్రభు, ఇతర వైద్యులు రెడ్‌ ‌క్రాస్‌ ‌జిల్లా కార్యదర్శి రమేష్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!