Take a fresh look at your lifestyle.

నడిమంత్రపు పేమలు

“కాలంకాని కాలంల రాళ్ళ వాన తీర్గ యెవలికన్న మన మీద అమాంతంగ పేమ బుట్టుకత్తె అనుమానం గొడుతది.జరంత బుగులైతది సుత.అమాంతం పేమలు,ఆగమాగం పేమలు శిత్రాలు బడేత్తయి.గీసొంటి పేమ పుట్టిపుట్టక మునుపె నన్ను మించినోళ్ళులేరంటది. ఇయాల్రేపటి పేమలు ఇచ్చంత్రం గుంటానయి.నమ్మేపేమలు,నమ్మని పేమలు, నమ్మినడింట్లముంచేటి పేమలు,దొంగ పేమలు, ఎడ్డి పేమలు,గుడ్డి పేమలు, గల్మివుతలి పేమలు,గల్మవుతలి పేమలు గిట్ల తీరొక్క పేమలుంటానయి.పేమ నమ్మకాల ఇత్తులేశి మనిషిని, మనుసును మదుపరిత్తది.మనిషి మీద మనిషికి బుట్టే పేమ అక్కెరయ్యే దాంక తియ్యగుంటది,అటెంక శేదైతది.”

కాలంకాని కాలంల రాళ్ళ వాన తీర్గ యెవలికన్న మన మీద అమాంతంగ పేమ బుట్టుకత్తె అనుమానం గొడుతది. జరంత బుగులైతది సుత.అమాంతం పేమలు,ఆగమాగం పేమలు శిత్రాలు బడేత్తయి. గీసొంటి పేమ పుట్టిపుట్టక మునుపె నన్ను మించినోళ్ళులేరంటది. ఇయాల్రేపటి పేమలు ఇచ్చంత్రం గుంటానయి. నమ్మేపేమలు, నమ్మని పేమలు, నమ్మినడింట్లముంచేటి పేమలు, దొంగ పేమలు, ఎడ్డి పేమలు,గుడ్డి పేమలు, గల్మివుతలి పేమలు,గల్మవుతలి పేమలు గిట్ల తీరొక్క పేమలుంటానయి.పేమ నమ్మకాల ఇత్తులేశి మనిషిని, మనుసును మదుపరిత్తది.మనిషి మీద మనిషికి బుట్టే పేమ అక్కెరయ్యే దాంక తియ్యగుంటది, అటెంక శేదైతది. ఈ పొద్దు శేదైన పేమనే మాపటీలికి తియ్యగైతది.’ తియ్యగున్నది,తీ!’ అని నమ్ముతె, ఇశమోలి గుంటది.అనుకోకుంటచ్చేటి పేమ అమాంతం కావలచ్చికుంటది, జెరంత అటిటయితె కండ్లు మూశి, తెరిశెటాలకు కస్సునకత్తులు దించుతది.ఇంకో పేమ గులాబీ తీర్గ సూడ సక్కంగుంటది. మస్తున్నదని ముద్దుబెడితె ముండ్లు గుచ్ఛుకోని మూతికి కుట్లేసుకునుడే!గులాబీ పేమల బడి మస్తు మంది మూతికి కుట్లేసుకోని మూలకు గూకున్నోళ్ళు మస్తుమందున్నరు.

చెట్టునూ,చెట్టు మీదున్న పిట్టను,ఇసిరిసిరి గొట్టే గాలీ,ఏట్లున్న నీళ్ళూ,పైనున్న రాళ్ళూరప్పలను మట్టినే కాదుల్లా,కంటికి గానచ్చిన ఎసోంటి బూమిని సుత ఇశిపెట్టకుంట పేమించెటోళ్ళుంటరు.మన కల్వకుంట్ల దొరకు పల్లెటూళ్ళంటె పానమని యెరికె గదా!పచ్చగుండే పల్లె బూములను జూడంగనె దొరకు గుండెల లబ్బడబ్బ సప్పుడైతది.ఇగ ఆ బూములు మీదనే మనుసు బడి పాటలు బాడుకుంటకలలుగంటడు.బువ్వ సుత ఇశమైతది.పల్లెబూముల బొమ్మను గుండెలగుడి గట్టుకోని తలుసుకోని,తలుసుకోని మనాది బడ్తడు.నిద్రలు లేకుంట యెంటబడి పేమించి,పేమించి యెట్ల జేశి వూరి మద్దెన టెంటు గట్టి పండుగ జేత్తడు.దొర పేమ వరదై అలుగుబారుతది.పచ్చని పంట పొలాల మీంకేలి మెరిశేటి నాలుగు సాల్లనజాకత్‌ ‌రోడ్లు బోత్తరు.అడుగడుగున తుపాకుల నాట్లేశి నిఘాకండ్ల పంటపండుతది.గా ఊరప్పుడు దొర పేమలబడి కాన్రాకుంట బోతది.

గీ తీర్గ బూముల్ని దప్ప మనుషుల్ని పేమించక బోవుడు ఓ బీమారని ఏ పెద్ద డాక్టర్లు జెప్పిండ్లో యేందో!గని,దొర గీనడ్మ మనుషుల పేమించుడు మొదలు జేశిండు.పగతి బంగ్లా గల్మ యెట్లుంటదో యెరుక లేనోళ్ళను సుత లోపటికి పేమగ పిలు సుడు!దావత్‌ ‌లిచ్చుడు అరె! నిజంగనే! శెవ్వా! నమ్మరేందుల్లా! పొద్దుగుం కినంక జెప్పేసోయి దప్పిన మాటకాదుల్లా! మొన్నదళిత నాయకులందరు రావాలని మతులబ్‌ ‌జేశిండు.దళితులకు మూడెకురాలిత్తనన్న మాట దొరకు గిన్నేండ్లకు యాదికి గిట్లచ్చిందాయేందని అందరనుకో బట్టిండ్లు. దళితున్ని ముక్కెమంత్రిజేత్తననె! మూడెకురాల బూమిత్తననె! ఉన్న బూములు గుంజుకునే కతలు బడ్డ దొర పేమలెనుక యేమున్నదో గని పోయినోళ్ళకు యేమెరుకయిందో జెప్పేదేమున్నది! మొన్నటి దాంక ఉప ముక్కెమంత్రేనాయె! యెదురుబడి దండం బెట్టిన సుత సూపు మీదికి తిప్పుకోని బోతివి,ఎన్ని తీర్ల ఆగంజేశినా ‘‘దొరా!బాంఛన’’నుకుంట యెంబటి బడుతాంటె మూలకు నూకితివి. గిన్నేండ్ల సంది లేని పేమ బుస్సున బుట్టుకచ్చె!ఛలో! పేమలు గారి యింటికి బోయి బువ్వ తినచ్చే కతలు బడితివి. గీ పేమకు యేం పేరు బెట్టాల్నో యేమో! హుజురాబాద్‌ ‌ల ఓట్లవాన కోసం గిసోంటి తియ్యటి పేమ పలారమోలిగె పంచిండ్లని ఊర్లపొంటి బహు జెప్పుకోబట్టిండ్లు.

చింతమడక, ఎర్రవెల్లి,నర్సన్నపేట ఊర్లను గీ పేమలు యేపాటి పైకి తీస్కపొయినయో యెర్కున్నదేనాయె!వాసాలమర్రి తొర్రల యేం మత్లబున్నదో గని వున్న వాసాలు బీకి పల్లెను బంగారు వాసాలమర్రి నుంచి బికారి మర్రి అయ్యేదాంక పేమ జోరుగ బారుతది.అటెంక సంగతటెంక. బూముల మీద నడిమంత్రపు ‘‘పేమలు’’వూర్లెకూర్లను ఆగంబట్టింతాంటె ఆగబట్టేటందుకు ‘‘చేయి’’ అడ్డం బెట్టెటోళ్ళెవలు కాన్రాకబాయె! దొరను జూశి దొర మనుషులందరు గిదే పని బెట్టుకున్నరు. ఏదో తీర్గ కతలుబడి బూములెనుక బడుడు,అటెంక అమ్ముకునుడే పనిగట్టుగోని జేయబట్టె! గిసోంటి దొరలు రాజ్జెమేలేకాడ నడింట్ల కట్టె బేర్సుకోని బూడిదయ్యే దినాలుమల్ల దాపురమయ్యె! వేములగాట్న మల్లారెడ్డి యెందుకు బుగ్గయిండని యెవలడుగాలె! ఎకురాల కొద్ది బూములు ఎడబాశిన పల్లెలల్ల రైతు గోస ఎవలికి జెప్పాలె! ‘‘కావలున్నోడే కసాయోడైతె జేశేదేమున్నది‘‘!? మల్లన్నసాగర్‌ ‌పేరు మీద బూమిబొయిన మల్లారెడ్డి పానవుండంగనె నడింట్లనే అగ్గి బెట్టుకుని పాయె!పానవుండంగ కట్టె బేర్చుకోని అగ్గి బెట్టుకునుడు దునియా మొత్తంల యేడన్నజూశిండ్లా! ఇల్లు బాయె!బూమి బాయె! మనిషెందుకు!అనుకున్నడేమో మల్లారెడ్డి! బుగ్గయి రాలిండు.గీ మనిషిని సంపిందెవలని అడిగెటోళ్ళెవలు లేరుల్లా! పతిపచ్చాల మీద అమాంతం పేమ బుట్టి పగతి బంగ్లకు బిలిశి దొర దావతిచ్చిండట! పిలిశినోళ్ళకు లేకుంటె,పోయినోళ్ళ కన్న ఇజ్జెతుండాలె గదా! గింతగనం పేమలు పంచినంక పతిపచ్చాలకు, బంగారు తెలంగాణ కానత్తాంది గని,మల్లారెడ్డి ,మరియమ్మ సావుపాట ఇనబడెటట్టులేదు.

ఆడెక్కడనో వుండే సముద్రం మొగాన గాలి సుడిదిరిగి ఆగం జేత్తె మనూర్లె వానలు దంచిగొట్టి నట్టున్నది.హుజురాబాద్‌ ‌ల ఓట్ల పండుగ మబ్బులు ముసురుకుంటె మన తాన గీ తీర్గ వరాల వానలు కుర్వబట్టె! కడుపులిషం జచ్చి పేమలు పైపైకి పొంగబట్టె! అనుకోని అలాయి బలాయిలు, అమాంతం బుట్టుకచ్చే పేమలతోని కావలింతలు, పేమల పలవరింతలు,పరాశికాలు గల్మ గల్మకిన్ని లచ్చక్కల జల్లు కురిశి పేమలు ఎగబాక బట్టె! గివన్ని యెల్లకాలముండేటియి కావుల్లా! నడిమంత్రపు పేమలు నట్టేట్ల ముంచుతయంటరు! పైలం!.

vikramarkudu

‘‘సూడ్రా! బయ్‌!ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటి దాంక యింటివి గదా! ఆరేడేండ్ల సంది దళితుల మీద,పతిపచ్చాల మీద లేనిపేమలు ఈ మద్దెన బుస్సున పొంగుకచ్చినయంట!యెందుకు గావచ్చు! దానెనుక మతులబేందో జెప్పాలె!? నా ప్రశ్నకు జవాబియాలె! లేకుంటె యెన్కకు బోయి మళ్ళ శెట్టెక్కుడే! నీకే తిప్పలైతది! పైలం!’’ యెప్పటి తీర్గనే బెదిరిచ్చే భేతాళుని పీనుగను బుజం మీదెసుకోని ‘‘ఇను భేతాళ్‌! ‌బుగులు గుండెల జొచ్చి నడిశేటందుకు తొవ్వలేకుంటె హైబత్‌ ‌దింటరు.గాబర గాబరైతె పానం పోతదన్న బుగులు ఇంకెక్కువైతది.సావుకాలం మోపైతాం దనేటి బుగులు బయటికచ్చి పేమలై కానత్తది. హుజురాబాద్‌ ‌మొగాన ఓట్ల పండుగ తోని గాలిదుమారమోలిగచ్చిన పేమలివి. నిలిశేటియి గావు,నిలబెట్టేటియి గావు.ఓట్ల పండుగ దాంక ఓడ మల్లన్న! అటెంక యెరికే గద! పేమలు దోమలైతయి’’ అని నవ్వుకుంట… నవ్వుకుంట….బొందల గడ్డ దాటబట్టిండు.
-ఎలమంద – తెలంగాణ

Leave a Reply