Take a fresh look at your lifestyle.

రైతన్న గోస చూసే నాధుడే లేడా..?

  • కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు లేవు
  • వరి ధాన్యం పోసి పది హేను రోజులు
  • తాలు ఉన్నదని ఇబ్బంది పెడుతున్న నిర్వాహకులు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రం రాజకీయ నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు కానీ అందుకు తగ్గట్లుగా రైతులు తీసుకు వచ్చిన వరి ధాన్యాన్ని కాటా పెట్టేందుకు రోజుల తరబడి హరి గోస పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వరి ధాన్యం ను ఇంటి దగ్గర పెట్టుకొని తేమశాతం లేకుండా తీసుకు వచ్చిన తర్వాత పెట్టాల్సింది పోయి రోజుల తరబడి నిరీక్షిస్తున్నామని తెలిపారు.

బస్తాలు లేవు వచ్చినప్పుడు పెడతాం అని 15 రోజుల నుంచి మాట చెబుతున్నారు గాని ఇంత వరకు బస్తాలు రాలేదని రైతులు అంటున్నారు, పంట పండించే టప్పుడు అంత ఇబ్బంది లేదు గాని పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రైతుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లోఅమ్ముకుంటే గిట్టుబాటు ధర వస్తుందని నాయకులు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు, గత వారం రోజుల క్రితం డోర్నకల్‌ ‌శాసనసభ్యులు డీఎస్‌ ‌రెడ్యానాయక్‌ ‌కురవి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీ లించి నప్పుడు బస్తాలు లేవని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో అధికారులకు వెంటనే ఫోన్‌ ‌చేసి కొనుగోలు కేంద్రాలకు బస్తాలు ఇవ్వమని చెప్పినా కూడా ఇంతవరకు బస్తాలు రాలేదని రైతులు అంటున్నారు, బస్తాల కోసం ఎమ్మెల్యే చెప్తేనే దిక్కులేదు మేము ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ధాన్యమును మంచిగా ఎండబెట్టుకుని మ్యాచరింగ్‌ ‌కు సరిపోను ఉండేటట్లు ధాన్యమును తీసుకువస్తే కాంట పెట్టాలని అడిగితే బస్తాలు లేవని సాకు చూపుతూ నానా ఇబ్బందులు పెడుతున్నారని త్వరగా ధాన్యాన్ని కాటా పెట్టండి వర్షం వచ్చేటట్లుంది అని అడిగితే నీ వడ్ల లో తాలు ఉన్నది తూర్పాలు పట్టు అని నాన అవస్థలు పెడుతున్నట్లు తెలుస్తోంది, కొనుగోలు కేంద్రాల్లో పట్టాలు కూడా లేవని వర్షం వస్తే నాన తిప్పలు పడాల్సి వస్తుంది అని ఇప్పటికైనా అధికారులు నాయకులు కలగజేసుకుని అన్ని ఏర్పాట్లు తోపాటు బస్తాలు త్వరగా వచ్చేటట్లు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!