Take a fresh look at your lifestyle.

బిజెపి అధ్యక్షుడిగా మరో ఏడాది పాటు నడ్డా

  • పదవీకాలాన్ని పొడిగించిన బిజెపి కార్యవర్గం
  • నడ్డా నాయకత్వంలోనే వొచ్చే ఎన్నికల్లో పోటీ
  • మోడీ, నడ్డాల సారథ్యంలో మరిన్ని విజయాలు
  • వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి అమిత్‌ ‌షా

న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి17: బీజేపీ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాశ్‌ ‌నడ్డా పదవీకా లాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ యేడు జరిగే 9 రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్‌ ‌వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిం చింది. 2019లో బీజేపీ వర్కింగ్‌ ‌ప్రెసి డెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020 లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టా రు. వాస్తవానికి నడ్డాపదవీకాలం ఈ నెలలో పూర్తి కానుంది. తిరిగి నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించాలని కమలనాథులు నిర్ణయించారు. అగ్రనేత అద్వానీ, అమిత్‌ ‌షాల తర్వాత వరుసగా రెండోసారి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగనున్నారు.  భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా  పదవీ కాలాన్ని 2024 జూన్‌ ‌వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది.

బిహార్‌, ‌మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ ‌వంటి రాష్టాల్ల్రో ఆయన నేతృత్వంలో పార్టీ బలపడినట్లు పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమాను వ్యక్తం చేసింది.  బీజేపీ సీనియర్‌ ‌నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా  మాట్లాడుతూ, తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్‌ ‌వరకు పొడిగించినట్లు తెలిపారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా కొనసాగుతారని చెప్పారు. నడ్డా నాయకత్వంలో తాము బిహార్‌లో అత్యధిక స్టయ్రిక్‌ ‌రేటును సాధించామని, మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించిందని, ఉత్తర ప్రదేశ్‌లో తాము గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ బలం పెరిగిందని చెప్పారు. అంతే కాకుండా గుజరాత్‌లో భారీ విజయాన్ని సాధించామని తెలిపారు. మోదీ, జేపీ నడ్డాల నాయకత్వంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు తమకు లభిస్తాయని చెప్పారు. సోమవారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ కీలక సమావేశంలో మోదీ, అమిత్‌ ‌షాలతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 9 రాష్టాల్ర శాసన సభల ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమైనవి. 2019లో బీజేపీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. అందరూ ఊహించినట్లుగానే ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని ప్రకటించారు. జేపీ నడ్డా నేతృత్వంలోనే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని అమిత్‌షా వెల్లడించారు.

జూన్‌ 2024 ‌వరకు నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగుతారని తెలిపారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషించారని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ, బెంగాల్‌ ‌రాష్టాల్ల్రో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఏర్పడిందన్నారు. లక్షా 30 వేల బూత్‌లెవెల్‌ ‌కమిటీలను నడ్డా నిర్మించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా వి•డియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2024 జూన్‌ ‌వరకు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని అమిత్‌ ‌షా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి కోవిడ్‌ను ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వచ్చింది. కోవిడ్‌ ‌మహమ్మారి వ్యాప్తి సమయంలో బీజేపీ చీఫ్‌ ‌జేపీ నడ్డా నేతృత్వంలో పల్లెపల్లెకు సేవా కార్యక్రమా లను తీసుకెళ్లారు.

రోగులను ఆసుపత్రికి పంపడం.. వారిని అన్ని విధాలుగా సహకరించడం చేశారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి పాపులారిటీని పెంచడంలో జేపీ నడ్డా కూడా సహకరించారని హోంమంత్రి అమిత్‌ ‌షా అన్నారు. 1970లో పాట్నాలో ఏబీవీపీలో చేరడం ద్వారా నడ్డాకు సంఘ్‌ ‌పరివార్‌తో అనుబంధం ఏర్పడింది.1986 నుంచి 89 వరకూ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1991లో బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు. 1993లో తన సొంత రాష్ట్రం హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌నుంచి అసెంబ్లీకి గెలిచారు. తర్వాత 1998లోనూ గెలిచారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. 2014లో మోదీ ప్రభుత్వ హయాంలోనూ ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. 2019లో బీజేపీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అయ్యారు.

Leave a Reply