Take a fresh look at your lifestyle.

మీడియా అకాడమీ కార్యదర్శిగా ఎన్. వెంకటేశ్వర రావు

హైదరాబాద్ ,సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా ఎన్. వెంకటేశ్వర రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారంనాడు మీడియా అకాడమి కార్యాలయంలో ఎమ్.డి. ముర్తుజా, కార్యదర్శి నుండి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చడానికి తగిన చర్యలు తీసుకుంటామని, అకాడమీ సిబ్బంది ఈ దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు.

అకాడమీ సిబ్బంది, టి.యూ.డబ్ల్యూ.జె. ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, యూనియన్ నాయకులు ఇస్మాయిల్, బిజిగిరి శ్రీనివాస్, తదితరులు నూతన కార్యదర్శికి అభినందనలు తెలిపారు. బదిలీపై వెళుతున్న ఎమ్.డి. ముర్తుజా, జాయింట్ డైరెక్టర్ కి విడ్కోలు పలికినారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ ఎమ్. పూర్ణ చందర్రావు, మేనేజర్ ఎ. వనజ, ప్రసాద్, రాజ్ కుమార్, నర్సింహ్మరావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply