Take a fresh look at your lifestyle.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలకలం

కళ్లు తిరిగి పడిపోయిన వైద్యారోగ్య శాఖ అధికారి
కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం.‌సుహాసిని అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె కలెక్టరేట్‌ ‌లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆంధ్ర హాస్పటల్‌ ‌కు తరలించారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొంతమేర ఆమె అస్వస్థతకు గురైనట్టు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గత వారం రోజులుగా కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గనటంతో పని ఒత్తిడికి గురయ్యారని, ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడిందని డిఐఒ డాక్టర్‌ ‌షర్మిష్ట తెలిపారు.

Leave a Reply