Take a fresh look at your lifestyle.

ఉస్మానియా దవాఖానా లో అనుమానాస్పద మృత దేహం

*గృహ పని కార్మికురాలు అపర్ణ (18) చనిపోయిందా / చంపేసారా ?
బొర్ర అపర్ణ (18 సంవత్సరాలు) మృత దేహం పోస్ట్ మార్టం కోసం హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో వుంది. ఇప్పటికి సేకరించిన సమాచారం ప్రకారం, ఆమె పని చేస్తున్న ఇంటి యజమానులు ముందు ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, పాప కండీషన్ సీరియస్ గా వుందని కనుక పెద్ద ఆసుపత్రికి తీసుకువేల్లమని చెప్పగా అమ్మయిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్దారించారు. యువతి  భౌతిక కాయం ఉస్మానియా ఆసుపత్రి  మర్చురిలో వుంది.
బొర్రా అపర్ణ తల్లి అర్జమ్మ, తండ్రి నల్లబాబు. తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, పోతులూరు గ్రామ పంచాయితీ పోతులూరు గ్రామం. అర్జమ్మ –నల్లబాబులకు  అపర్ణ తోలి సంతానం. అపర్ణకు ఒక చెల్లి, తమ్ముడు వున్నారు. వారు గ్రామంలో ని వుండి చదువుకుంటున్నారు. అపర్ణ తండ్రి తనకు 8 ఏళ్లుగా వుండగా చనిపోయారు. తల్లి అర్జమ్మ తనకు తెలిసిన వారి ద్వారా, కుక్కటిపల్లి (JNTU వెనుక) చెరువు కట్టకు దగ్గిరలో వున్నా ‘ప్రగతి నగర్’ లో ఒకరి ఇంటిలో డోమిస్టిక్ వర్కరుగా పనికి పెట్టింది. అపర్ణ గత ౩ ఏళ్లుగా అదే ఇంటిలో వుంటూ పని చేస్తుంది. అపర్ణ పంపే సహాయంతో తమ్ముడు, చెల్లి చదువుకుంటున్నారు.
అపర్ణకు స్వంతంగా సెల్ ఫోన్ లేదు. తానూ ఆ ఇంటి యజమానురాలు ఫోన్ తోనే తల్లికి ఫోన్ చేస్తూ వుంటుంది. అయితే తాను చనిపోవడానికి మూడు రోజులు ముంది వరకు వాచ్ మెన్ ఫోన్ ద్వార తల్లికి ఫోన్ చేస్తుంది. తల్లితో వ్యక్తీగతంగా మాట్లాడాలని, తనను అక్కడి నుండి తీసుకుపొమ్మని ఆమె తల్లిని కోరుతూ వస్తున్నది. తల్లి అందుకు చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
ఇంటి యజమానుల ప్రకారం, నిన్న పిల్లల గది శుభ్రం చేస్తూ పడిపోయిందని, తాము వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువేల్లగా వారు పెద్ద ఆసుపత్రికి తీసుకు వేల్లమన్నారని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అప్పటికే ఆమె చనిపోయిందని వారు చెపుతున్నారు. ఈ రోజు (02/06/2020)తెల్లవారుకు  తల్లి, ఇతర బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ఘటన పై వెంటనే దర్యాప్తు కు ఆదేశించాలని లిజీ జోసెఫ్,డోమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్,కె.సజయ సామాజిక కార్యకర్త,వర్షా భార్గవి,చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్..మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!