‘నా ఓటు నాశక్తి’ అని వోటర్లు గుర్తించాలి

నా ఓటు నాశక్తి అనే విషయాన్ని ఓటర్లు గుర్తించాలని ఎలాంటి ప్రలోబాలకు లోనుకాకుండా నిజాయితీతో ఓటు వేయాలని అత్యదిక శాతం పోలింగ్‌ను చేసి కొత్త ఓరవడిని సృష్టించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలోని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కలెక్టరేటు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో ఈనెల 22న పోలింగ్ నిర్వహాణకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటిలల్లో ఉన్న మొత్తం 2 లక్షల 4 వేల 509 మంది ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 135 వార్డులుగా విభజించి 285 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వికలాంగ ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ట్రైసైకిల్ తోపాటు ప్రత్యేక వాలంటరిని నియమించామన్నారు. జిల్లాలో కోరుట్లలో మూడు, మెట్‌పల్లిలో ఓక వార్డు ఏకగ్రీవ మైందన్నారు. జిల్లాలో 130 వార్డులలో జరిగే పోలింగ్‌లో 566 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఈ ఎన్నికల నిర్వహాణ కోసం 362 మంది పివోలు, 362 మంది ఎపివో లు, 1086 మంది ఓపివోలు ఎన్నికల విధుల్లో పాల్గోంటార న్నారు. 31 జోన్లను విభజించగా ఇందులో 31 మంది జోనల్ అఫిసర్లతోపాటు రూట్ అఫిసర్లు పనిచేస్తారని చెప్పా రు. 13 ఫ్లయింగ్‌స్కాడ్ టింలు, 15 స్టాటిటిక్ సర్వేలయన్స్ టిమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తామని అయన తెలిపారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 18 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని వాటిపై దఫాలుగా చర్చించి ఎన్నికల నిర్వహాణకు ఏర్పాట్లు చేశామన్నారు. అయా పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహాణ కోసం 51 మైక్రో అబ్జర్వర్స్, 51 మంది లైవ్ వెబ్ కాస్టింగ్, విడియోగ్రఫి వంటి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహాణను చేస్తున్నామన్నారు. నేటి సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి ముగింపు అని ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల ప్రచారాన్ని చేయరాదన్నారు.
ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికలలో అక్రమాలను నిరోదించడానికి 180042 57620 అనే టోల్‌ఫ్రి నెంబర్ ఎన్నిక పూర్తయ్యేనాటి వరకు నిరంతరం పనిచేస్తుందని ఫిర్యాదులు ఈ నెంబర్లలో చేస్తే వెంటనే చర్యలుంటాయాని కలెక్టర్ పేర్కోన్నారు. ఎన్నికల సందర్బంగా ఎన్నికల కమీషన్ నిబందనల ప్రకారం మద్యంషాపులు మూసి ఉంటాయని ఎన్నికల నిర్వహాణ కోసం బారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని అయన తెలిపారు. ఆనంతరం ఎస్పి సింధూశర్మ మాట్లాడుతూ ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని అలాగే వంద మీటర్ల లోపలి వరకు ఎవరూరాకుండా నిబందనలు ఉన్నాయన్నారు. గత ఎన్నికల నేపద్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంవారీగా మ్యాపులను సిద్దంచేసి ఆప్రకారంగా బందోబస్తుకు ఏర్పాట్లు చేశామన్నారు. నేరస్తులను, సమస్యాత్మకమైన వ్యక్తులను ముందే బైండోవరు చేశామని హిస్ట్రి షీటర్స్‌ను అవసరమైన మేరకు పిడియాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటిలలో ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి. రాజేశంతోపాటు ఎవో వెంకటేష్‌లు ఉన్నారు.
Tags: my vote,recognize,threat,Collector Dr. Sharath