Take a fresh look at your lifestyle.

ఓటమికి బాధ్యత వహిస్తున్నా : మంత్రి హరీష్‌రావు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పందించారు. ఈ మేరకు మంగళవారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…దుబ్బాక ఉప ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన ప్రజా తీర్పును శిరసా వహిస్తామనీ అన్నారు. అలాగే, ఈ  ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానీ అన్నారు.

టిఆర్‌ఎస్‌  ‌పార్టీకి వోటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలన్నారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామనీ, తమ లోపాలను సవరించుకుంటామన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం..అందుబాటులో ఉంటామనీ,  ఓటమి పాలయినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పక్షాన, తన పక్షాన కష్ట సుఖాల్లో ఉంటామన్నారు.  సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎప్పుడు కృషి చేస్తోందనీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply