Take a fresh look at your lifestyle.

‌ప్రజల పక్షాన నా పోరాటం ఆగదు

  • జగన్‌ ‌రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిద్దాం
  • మూడున్నరేళ్లలో ఎపిని అధోగతి పాలుచేశారు
  • పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ ‌మాత్రమే
  • డియా సమావేశంలో మండిపడ్డ చంద్రబాబు

కుప్పం,జనవరి5 : ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన టిడిపి పోరాటం కొనసాగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తనపోరాటం కేవలం ప్రజల కోసమేనని అన్నారు. జగన్‌ ‌నిరంకుశ సైకో పాలన అంతమొందించేందుకే తన పోరాటం అని అన్నారు. కుప్పంలో బాబు డియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని.. ఇప్పుడు రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాడుతున్నామన్నారు. ఈ సందర్భంగా కుప్పంలో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను డియా ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ ‌మాత్రమే. తమాషా ఆటలాడుతున్నావు.. నీ తడాఖా ఏంటో చూస్తా. నేను రెచ్చగొట్టానా? మాపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నావు.

అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేనూ అలాగే అనుకునుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా? ఇప్పుడు ఇష్టప్రకారం అరాచకాలు చేస్తారా? కుప్పంలో కప్పం కట్టాలని బెదిరిస్తావా? నువ్వొక రాజకీయ నాయకుడివా? తమాషా అనుకోవద్దు.. వదిలిపెట్టం. కుప్పంలో రౌడీలను ప్రోత్సహిస్తామంటే ఖబడ్దార్‌..! అని చంద్రబాబు హెచ్చరించారు.  ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని… తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్‌ ‌చేశారు. జగన్‌లో భయం పుట్టుకొచ్చిందన్నారు. ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందుకు రావాలన్నారు. తప్పు ఎవరు చేసినా సరిదిద్దు కోవాలని సూచించారు. తెలుగుజాతి కోసం త్యాగాలు చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. 5 కోట్ల మంది బాధపడుతుంటే శాడిస్ట్ ‌సీఎం ఆనందపడతారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తులే అని… డీఎస్పీ ప్రజలకు సర్వెంటా.. వైసీపీకా అని బాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. జడ్జీలపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తపై పోలీసులు అక్రమ కేసులు పెడితే.. తాము కూడా పోలీసులపై ప్రైవేట్‌ ‌కేసులు పెడతామన్నారు. కుటుంబాలు ఎలా బాధపడతాయో పోలీసులకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసులు ఆలోచించాలి.. 5 కోట్ల మందికి సహకరిస్తారా.. శాడిస్ట్ ‌సీఎం పక్కన ఉంటారా అని ప్రశ్నించారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. సీఎం జగన్‌ ‌పనైపోయిందని.. ఇంటికి పోతారని అన్నారు. జగన్‌కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ చీఫ్‌ ‌తెలిపారు. కుప్పంలో ప్రభుత్వం రౌడీల రాజ్యం తేవాలని చూస్తోందని అన్నారు. రౌడీ రాజ్యాన్ని అణచివేస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడని పోలీసులు ఖాకీ బట్టలు వేసుకున్న నేరస్తులని వ్యాఖ్యానించారు. జగన్‌ ‌ప్రభుత్వంలో డ్రగ్స్‌కు ఏపీ రాజధాని అయిందన్నారు.

జగన్‌ ‌ఖబడ్దార్‌ ‌గుర్తుపెట్టుకో.. ఇసుక మైనింగ్‌లో నీకు రూ.50 కోట్ల కప్పం కట్టాలా?. గౌరవ సభ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారు. తిరిగి గౌరవ సభగా మారినప్పుడే అసెంబ్లీలో అడుగుపెడతా. రాష్ట్రంలో రెండే ప్రత్యామ్నాయాలు… జగన్‌కు భయపడి బతకడం లేదా.. తప్పులను ఎదిరించి నాలుగు రోజులు జైల్లో ఉండి రావడం అంటూ చంద్రబాబు హెచ్చరించారు. పిల్లి ఏ రంగులో ఉందన్నది ముఖ్యం కాదు.. ఎలుకలను సమర్థంగా పడుతుందా లేదా అన్నది ముఖ్యమన్నారు. ఐటీ రంగంలో ఏపీని ప్రపంచానికే అగ్రగామిగా నిలపాలనుకున్నానని.. మూడున్నరేళ్లలో బిహార్‌ ‌కంటే ఏపీ వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదన్నారు. నిందితులపై కాకుండా.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోలు బ్రిటిష్‌ ‌కాలంలో ఉన్నారు.. ఇప్పుడూ ఉంటున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply