Take a fresh look at your lifestyle.

మటన్ రు.800, చికెన్ 180

  • లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన మాంస వినియోగం
  • రేట్లు పెంచి సొమ్ము చేసుకున్న వ్యాపారులు 

రాష్ట్రంలో కూరగయాల ధరలతో పాటు ఇంతకాలం స్తబ్దుగా ఉన్న చికెన్‌, ‌మటన్‌ ‌ధరలు అనూహ్యంగా పెరిగాయి. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికితోడు’కరోనా ప్రబలేందుకు.. చికెన్‌, ‌మటన్‌, ‌చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలని వైద్యులు ప్రకటించడంతో ప్రజలు మళ్లీ ముక్కపై మక్కువ పడ్డారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.దివారం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా ఎన్నడూ లేనంత రేట్లకు అమ్మారు. ఇటీవలి వరకు కిలో మటన్‌ ‌రూ.680 నుంచి రూ.700 మధ్య ఉండగా.. రూ.800 అయింది. ఎపి, తెలంగాణల్లో అధికరేట్లకు మాంసం చేపలను అమ్మారు. కొన్ని జిల్లాల్లో కిలో మటన్‌ ‌ధరను ఏకంగా రూ.200 పెంచేసి.. రూ.800కి విక్రయించారు. పశు వెద్యాధికారులు పరీక్షలు చేయని, కనీసం స్టాంపులు కూడా వేయని మేకలు, గొర్రెలను కోసి అమ్మేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

అదే క్రమంలో ధరలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో ఒక్క రోజుకు అంత ఖర్చు అవసరమా? అని సాధారణ, మధ్య తరగతి వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించేందుకు సంచార రైతు బజార్లు ఏర్పాటుచేసింది. ఇప్పటికే ఉన్నవాటిని కూడా నడిపిస్తోంది. అదే క్రమంలో మాంసం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఈ నెల ప్రారంభం వరకు రూ.180 ఆపైన ఉన్న కిలో చికెన్‌ ‌ధర.. కరోనా వ్యాప్తి వదంతులతో భారీగా పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.40 లెక్కన అమ్మేశారు. కానీ, మళ్లీ నాలుగు రోజులుగా ధర పెరగడం మొదలైంది. మొన్నటిదాక ఉచితంగా ఇచ్చిన కోడి ధర రూ.180కి విక్రయించారు. చేపల ధర కూడా భారీగా పెరిగింది. కిలో రూ.110-రూ.120 మధ్య ఉన్న రగులు, బొచ్చెల ధర రూ.180- రూ.200 చేశారు. మొన్నటి వరకు వినియోగదారుల ఆదరణ కోల్పోయిన చికెన్‌ ‌ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కొండెక్కి కూర్చుంది. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతిన్న పౌల్టీ రంగం ఇప్పుడు కుదుట పడుతున్నది. ఆదివారం ప్రజలంతా మాంసం కొనుగోళ్లకు ఆ సక్తి చూపారు. ముఖ్యంగా మటన్‌, ‌చికెన్‌ ‌తీసుకునేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు.మొన్నటి వరకు రూ.30కే కిలో చికెన్‌ అమ్మిన వ్యాపారులే నేడు రూ.160కి కిలో చికెన్‌ ‌విక్రయించారు. ధరలు అమాంతం పెరిగినప్పటికీ వినియోగదారులు మాత్రం మాంసం రుచి చూసేందుకే ఇష్టపడ్డారు. కరోనా వైరస్‌ ‌మహమ్మారితో అతలాకుతలమైన పౌల్టీ రంగంలో ప్రస్తుతం బాయిలర్‌ ‌కోళ్లు అందుబాటులో లేవు. డిమాండ్‌కు తగ్గట్టు కోళ్లు లేకపోవడంతో ధరలు పెరిగినట్లుగా అర్థమవుతున్నది.

Leave a Reply