Take a fresh look at your lifestyle.

ఎల్ఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి

టీ జేఏసీ అధ్యక్షుడు ప్రో.కోదండరాం

సుబేదారి, సెప్టెంబర్‌ 29, (‌ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా శాసనసభలో తన వాణి వేడి వినిపించుట కు గాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీజేఏసీ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడతామని ఇందుకు టీజేఏసీ నాయకులు సంసిద్ధం కావాలని డి జె సి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. మంగళవారం వరంగల్‌ ‌లో ఏర్పాటుచేసిన ముఖ్యుల సమావేశంలో కోదండరాం పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రమని తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేసే విధంగా మెడలు వంచాలని ఇందుకుగాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు టీజేఏసీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఏర్పడిన జేఏసీ ఏ విధంగా పని చేసిందో ప్రస్తుతం మళ్లీ జేఏసీగా ఏర్పడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చట్టసభల్లో అడుగుపెట్టాలని ఇందుకుగాను ఎమ్మెల్సీ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించాలని ఆయన ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని పట్టభద్రుల సర్టిఫికెట్లను ప్రభుత్వం స్వీకరిస్తుందని పట్టభద్రుల సర్టిఫికెట్‌ ‌లతో ఓటర్లుగా నమోదు చేసుకొని ప్రభుత్వం విజయం సాధించాలని చూస్తోందని గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలకు ఏ మాత్రం దోహద పడటం లేదని ప్రజలు కోరుకున్న పాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ల్యాండ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌స్కీమ్‌ ‌పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఇది ప్రజావ్యతిరేక విధానమని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యాలయాలు టిఆర్‌ఎస్‌ ‌నాయకుల కోసమే ఏర్పాటు చేశారని ఇది సామాన్య ప్రజలకు ఏ విధంగా దోహదపడతాయి ఆయన అన్నారు వరంగల్‌ ‌లో వరదలు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వం యొక్క పనితీరు బయటపడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని రైతులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్రంలోని అనేక విభాగాలలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగ క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా టీజేఏసీ ఈ ఎన్నికలలో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెడుతుందని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు, పట్టభద్రులఎన్నికలలో మహబూబ్నగర్లో కూడా పోటీ చేస్తామని ఒకటి రెండు రోజులలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన అన్నారు ప్రైవేటు టీచర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారికి సరైన వేతనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ పరంగా ప్రైవేట్‌ ‌టీచర్లను ఆదుకోవాలి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వారు పునరాలోచించుకోవాలని ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోదండరాం కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించే దిశగా పట్టభద్రులు అందరూ తమకు సహకరించాలని టీజేఏసీ నాయకులు కోదండరాం పట్టభద్రులను కోరారు. ఈ సమావేశంలో టీ జె సి వరంగల్‌ ‌జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply