Take a fresh look at your lifestyle.

కరోనా రావొద్దంటే.. పౌష్టికాహారం తినాలి..: హరీశ్ రావు

  • కార్మికులు మంచిగుంటనే సిద్ధిపేట సల్లగుంటది
  • సిద్ధిపేట మున్సిపల్ కార్మికులకు త్వరలోనే గిఫ్ట్
  • ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి 60 గుడ్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

కరోనా రావొద్దంటే.. పౌష్టికాహారం తినాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీలో నిత్యం నిరంతరం విధులు నిర్వహిస్తున్న 500 మంది వాటర్ సప్లయ్, విద్యుత్, సఫాయి కార్మికులకు ఒక్కొక్కరికీ 60 గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ కష్టం గొప్పదని, అందరికీ జీతాలు కోసినా కానీ మీకు ఒక్క రూపాయి జీతం కూడా కోయలేదని చెప్పారు. కరోనా నేపథ్యంలో మీరంతా తప్పకుండా మాస్కులు ధరించాలి, గ్లౌజులు వేసుకోవాలని, శానిటైజర్లను తప్పక వాడాలని.., మీ మంచి కోసమే చెబుతున్నానని, మీరు మంచిగుంటనే సిద్ధిపేట సల్లగుంటదని పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ దృష్ట్యా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినా కానీ డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు జీతం తక్కువ చేయలేదన్నారు.

- Advertisement -

కరోనాను డాక్టర్లు, పోలీసులు లేకపోతే ఇబ్బందులు, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు మీరు లేకపోతే మరిన్ని కష్టాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. మీకు 5 వేల రూపాయల అదనపు జీతం సీఏం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. కరోనాను మందు లేదని, కానీ ఒక్క తోవ ఉన్నదని పౌష్టికాహారం తినాలని, కోడిగుడ్లు, చికెన్, మాంసం, పప్పులు కడుపు నిండా పౌష్టికాహారం తింటే కరోనా రోగం మనకు రాదని వివరించారు. వేడి చేసి చల్లర్చిన గోరువెచ్చని నీళ్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రెండు గ్లాసుల చొప్పున తాగాలని సూచించారు. పండ్లు తినాలని, ఈ పరిస్థితుల్లో పండ్లు తెచ్చుకోవాలంటే.. భయపడాల్సిన అవసరం లేదని పండ్లను ఉప్పు నీళ్లలో కడగాలని కార్మికులకు అవగాహన కల్పించారు.

సిద్ధిపేట మున్సిపల్ సఫాయి కార్మికులు చాలా బాగా పని చేస్తున్నారని, గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించామని, మీకు త్వరలోనే తప్పకుండా మంచి గిఫ్ట్ ఇస్తామని మంత్రి మాట ఇచ్చారు. గ్లౌజులు వేసుకోని, మాస్కులు ధరించని వారిని గుర్తు పట్టి వారి గిఫ్ట్ ఆపేస్తానని మీ మంచి కోసమే చెబుతున్నానని నా మాట వినాలని, మాస్కు, గ్లౌజులు లేకుండా సఫాయి కార్మికులు రోడ్డు మీదకు రావొద్దని మంత్రి సూచించారు. ఈ మేరకు సిద్ధిపేట పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30వేల కోడి గుడ్లను 500 మంది మున్సిపల్ కార్మికులకు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Leave a Reply