Take a fresh look at your lifestyle.

పట్టెడన్నం పెట్టాలంటే పుట్టెడు వడ్లు కొనాలి కదా!

పేదలకు పట్టెడన్నం పెట్టడం రాజ్యానికి ఉన్న రాజ్యంగ బద్దంగా బాధ్యత అని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తుంటే పండించిన వారి ఎవరు కొనాలో చెప్పక కల్లంలోనే రైతులు గుండె పగిలి చనిపోయే స్థితి తీసుకువస్తున్నారు తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు కాక అల్లల్లాడుతున్న రైతుల దగ్గరకు పోయి ధాన్యం అవస్థకు కేసియార్‌ ‌వైఖరే కారణమని బి.జె.పి… మోడీ ప్రభుత్వమే కారణమని టిఆర్‌యస్‌ ‌బాహాబాహీగా తలపడుతుంటే నెత్తి పట్టుకు కూర్చోవడం రైతుల వంతయింది.

ఈ రెండు రోజులు బిజెపి కార్యకర్తలపై పోలీసుదన్నుతో కర్రలతో దాడులకు పాల్పడ్డ టిఆర్‌యస్‌ ‌రేపు ధర్నాకు కూడా దిగి వదిలి పెట్టకుండా వెంటాడుతామని ప్రకటించింది స్వయానా కేసియారే రెచ్చగొట్టినా, బండి సంజయ్‌ ‌సవాళ్లు విసరడమే కానీ సమస్య పరిష్కారం కోసం వెతుకుతున్నట్లు కనిపించట్లేదు. సందులో సడేమాయా తీరు వరి కొనుగోలు రచ్చలో 6 యం.యల్‌.‌సి పదవుల్ని కేసియార్‌ ‌బంగారు తెలంగాణ ఆధిపత్య కులాలకు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు పంచి బి.సీలకు, ఉద్యమకారులకు మొండిచేయి చూపించాడు.

రైతులను వరివేస్తే ఉరికిచ్చి కేసులు పెడతానన్న సిద్దిపేట కలెక్టర్‌ ‌వెంకట్రామ్‌రెడ్డిని ఆగమేఘాల మీద రాజీనామ చేయించి యం.యల్‌.‌సి పదవి కట్టబెట్టినాడు. అవినీతికి, అహంకారానికి కేరాఫ్‌గా ఉన్న వెంకట్రామ్‌రెడ్డి రాజీనామా ఆమోదించి, పదవి కట్టబెట్టడానికి 24 గంటలు కూడా పట్టలేదు. వెంకట్‌రామ్‌రెడ్డి రాజీనామా, నామినేషన్‌ ‌తిరస్కరించాలని, ఈ.సీకి, గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాము.

బండ ప్రకాష్‌ను ముదిరాజ్‌ ‌ప్రాతినిధ్యం గా తీసుకువచ్చినందున అది బి.సిలకు ఇచ్చిన సీటుగా కాక కల్వకుంట్ల కవిత కోసం చేసిన ఏర్పాటుగా చూడవలసి ఉన్నది. ఒక్క బిసి ని కౌన్సిల్‌కు పంపినా పంపకపోయిన ప్రతిపక్షాల ఆచరణ కూడా ఇంతకు భిన్నంగా లేనందున తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజకీయాల్లో అనాసక్తిని చూపుతున్నారు. తెలంగాణాలో ఉద్యమ, సామాజిక శక్తులు ప్రజావ్యతిరేక, ఆధిపత్య వర్గాలకు పెద్దపీఠ వేసే అధికార పార్టీని, భిన్నంగా లేని ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టవలసి ఉన్నది.

 –  డా. చెరుకు సుధాకర్‌
 ‌తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు

Leave a Reply