Take a fresh look at your lifestyle.

ఘనమైన చరిత్రకు నిజమైన ఆధారాలు మ్యూజియంలు

సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనకు తెలియని ఎన్నో విషయాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అందిస్తాయి. జాతి యొక్క ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు గల ప్రయాణాన్ని మ్యూజియంలు వివరిస్తాయి. పూర్వ ప్రజల ఆచారాలు, ధరించిన వస్త్రాలు, వస్తువులు, ఆయుధాలు, పని ముట్లు మొదలగు వాటిని ప్రతిభింబిస్తాయి. ఎన్నో గాథలకు అక్కడ సాక్ష్యాలు కనిపిస్తాయి. ఘనమైన చరిత్రకు నిజమైన ఆధారాలుంటాయి. పురాతన వస్తువులన్నీ అలనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి. మొదట ఫోను మనల్ని పలకరిస్తుంది. రెండో తరం కం ప్యూటర్‌ ఆకట్టుకుంటోంది. తాతల కాలం నాటివర్ణ చిత్రాలు అబ్బుర పరుస్తాయి. రాజుల ఖడ్గాలు రాజసాన్ని ఒలికిస్తాయి. సింహాసనాలు దర్జాగా కొలువుతీరుతాయి. సాసర్‌నుంచి శాటిలైట్‌దాకా అక్కడ కనిపించే వెన్నో. వినిపించే కథలెన్నో, చరిత్రకు చిరునామాలు, విజ్ఞాన భాండాగారాలు, మ్యూజియాలు.

ఒకప్పుడు మ్యూజియం అంటే జనాలు పరుగులు తీసేవారు. అక్కడి కెళ్లి అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకునేవారు. చరిత్రను తెలుసుకునే వారు. విజ్ఞానాన్ని పెంచుకునే వారు. కానీ నేడు మ్యూజియాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. పురాతన వస్తువులను చూసి మనం ఏం చేస్తాం? అనే ధోరణితో చాలా మంది మ్యూజియం తలుపు తట్టట్లేదు. మ్యూజియాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, వాటిపె ప్రజల్లో అవగాహణన తీసుకురావడానికి ‘• •ఇంటర్నేషన ల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్‌) 1977‌లో ‘‘మే18ని మ్యూజియం డే ‘‘గా ప్రకటించింది. ఆ రోజు నుంచి మే 18న ఎన్నో మ్యూజియాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 129 దేశాల్లోని దాదాపు 30 వేల మ్యూజియాలు ఈ రోజు (మ్యూజియండే) ను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాలపె ఎన్నో ప్రత్యేక మ్యూజియంలు నెలకొన్నాయి. జీవితంలో పెరుగుతున్న వేగం నేపథ్యంలో ఎంతో మంది ఏ మ్యూజియం నూచూడలేక పోతున్నారు. అలాంటి వారికి ఓ తరుణోపాయం ఆన్‌లైన్లో్ల మ్యూజియంల ను వీక్షించడం. ఇంటర్నెట్‌ ‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఆన్‌లైన్లోనూ ఎన్నో మ్యూజియంలు రూపుదిద్దు కుంటున్నాయి. వీటినే వర్చు వల్‌ ‌మ్యూజియంలు గా వ్యవహరిస్తున్నారు. భౌతిక రూపంలో ఉన్న మ్యూజియంల కుడి జిటల్‌ ‌రూపం ఇచ్చేవి కొన్నయితే, కేవలం డిజిటల్‌ ‌రూపంలో మాత్రమే ఉండేవి మరికొన్ని.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన మ్యూజియంలలో, చాలా మందికి గుర్తుకు వచ్చేది సాలార్‌జంగ్‌ ‌మ్యూజియం. ఒక వ్యక్తి సేకరించిన వస్తువులతో రూపుదిద్దుకున్న మ్యూజియంలలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాలార్జంగ్‌ ‌మ్యూజియంలో క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 20వ శతాబ్దానికి చెందిన వస్తువులు కొలువె ఉన్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 40 వేల కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఐవరీ, చేనేత, కలంకారి, ఇనుప, చెక్క, జేడ్‌లతో రూపొందించిన కళాకృతులను ఈ మ్యూజియంలో చూడొచ్చు. చైనా, జపాన్‌, ‌యూరోపియన్‌ ‌పేర్లతో గ్యాలరీలున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోని మరో కటి, నాగార్జున సాగర్‌కు సమీపంలో కృష్ణానదిపై ఉన్న నాగార్జున కొండ మ్యూజియం. ఇందులో కొత్త రాతియుగంలోని బంగారు నగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు తదితర వస్తువులు దర్శకులను ఆకట్టుకుంటాయి.

ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియమ్స్..

‌లెలూవర్‌ ‌మ్యూజియం :
ఫ్రాన్స్ ‌రాజధాని ప్యారిస్‌ ‌లోని ప్రాచీన మ్యూజియం ఇది. సువిశాలమైన ఈ మ్యూజియంలో చరిత్రపూర్వయుగం నాటి వస్తువుల మొదలుకొని ఇరవె ఒకటో దశతాబ్ది నాటి ఆధునిక వస్తువుల వరకు అనేక అరుదైన వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తాయి. పన్నెండో శతాబ్దిలో రెండో ఫిలిప్‌ ‌హాయాంలో కోటగా నిర్మించిన ఈ భవంతిని ఫ్రెంచి విప్లవం తర్వాత 1793లో మ్యూజియంగా మార్చారు. ప్రాడో మ్యూజియం: స్పెయిన్‌ ‌రాజధాని మాడ్రిడ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన యూరోపియన్‌ ‌కళా ఖండాలు కనిపిస్తాయి. స్పెయిన్‌ ‌రాజుల హయాంలో వారు వాడిన వస్తువులు, వారు సేకరించి నవస్తువులతో, కళాఖండాలు, ఆభరణాలతో ఈ మ్యూజియంను 1819లో ఏర్పాటు చేశారు.

స్టేట్‌ ‌టెర్మిన్‌ ‌మ్యూజియం: సెయింట్పీ టర్స్బర్గ్, ‌రష్యాలోని అతి పురాతనమైన మ్యూజియం ఇది. ఆరు భవంతుల ప్రాంగణంలో 1754లో ఏర్పాటైంది ఈ మ్యూజియం. ఈ ప్రాంగణంలోనే అప్పట్లో రష్యన్‌ ‌జార్జ్ ‌చ క్రవర్తులు విడిది చేసే ‘వింటర్‌ ‌ప్యాలెస్‌’ ‌కూడా ఉంది. ఇందులో పురాతన ఈజిప్షియన్‌, ‌గ్రీకు, రోమన్‌ ‌నాగరికతలకు చెందిన అరుదైన వస్తువులు ఉన్నాయి. రైక్సు మ్యూజియం : నెదర్లాండ్స్ ‌రాజధాని ఆమ్‌‌స్ట్రడామ్‌లో ఉన్న ఈ మ్యూజియం చక్కటి కళా ఖండాలకు ఆలవాలంగా సందర్శకులకు కనువిందు చేస్తోంది. తొలుత దీనిని 1800లో హేగన్‌ ‌గరంలో ఏర్పాటు చేసినా, 1808లో ఆమ్‌‌స్ట్రడామ్‌లోని రాజ ప్రాసాదానికి తరలించారు. ఆ తర్వాత 1885లో ప్రస్తుత భవంతిలోకి మార్చారు. అప్పటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్‌ ‌మ్యూజియం: బ్రిటిష్‌ ‌రాజధాని లండన్లోని పురాతన కట్టడాల్లో ఒకటి బ్రిటిష్‌ ‌మ్యూజియం. వైద్యుడు, శాస్త్రవేత్త సర్హాన్స్స్లోన్‌ 1753‌లో తాను సేకరించిన పురాతన వస్తువులతో దీనిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు దీనిని చూసేందుకు ప్రజలను అనుమతించడం మొదలుపెట్టారు. ఈజిప్షియన్‌ ‌మమ్మీల మొదలు కొని అనేక అరుదైన పురాతన చారిత్రక వస్తువులకు ఇది కేంద్రంగా ఉంటోంది.

ఇంకా, ఇటలీలోని జిగ్నీస్లో ‘అంబ్రెల్లామ్యూ జియం’, వియన్నాలో గోడ గడియారాలతో ‘వియెన్నెస్కా మ్యూజియం’, అమెరికాలోని గాట్లిన్‌బర్గ్లో ‘సాల్ట్ అం‌డ్పెప్పర్షేకర్స్’ ‌మ్యూ జియం, ఇలాచెప్పు కుంటూ పోతే బోలెడు మ్యూజియాలున్నాయి. పజిళ్లకు కూడా ఓ మ్యూజియం ఉంది. వాటర్‌క్యాన్లకు జర్మనీలో ఓ మ్యూజియం ఉంది. యుద్ధ ట్యాంకులు, విమానాలకు సంబంధించిన మ్యూజియం చాలా దేశాల్లో ఉన్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మ్యూజియాల జాబితా చూస్తే.. మ్యూజియంలో పెట్టడానికి కాదేది అనర్హం అనాలేమో. ఈ మ్యూజియాల ద్వారా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అంశాలను, నేటి తరాల వారికి ఎంతో చక్కగాఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యూజియంలు నేటి తరానికి జ్ఞాన బండరాలుగా, శాస్త్రవేత్తలకు పరిశోధకులకు, చారిత్రక సమాచార వనరులుగా దోహదపడుతున్నాయి. పాలకులు మ్యూజియంలను పరిరక్షిస్తూ భావితరాల కోసం చరిత్రను, ప్రాచీన సంస్కృతులను కాపాడాలి. అందుకే ఈ సంవత్సర థీమ్‌ ‘‘‌మ్యూజియం ల భవిష్యత్‌ – ‌రికవరీ’’ గా గుర్తించడం జరిగింది.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply