Take a fresh look at your lifestyle.

గుట్టు హత్యల హంతకుడు అరెస్టు

[ads_color_box color_background=”#87faf8″ color_text=”#444″]కల్లు తాగే మహిళలే టార్గెట్‌
హంతకుడి వద్దనుండి ఆభరణాలు స్వాధీనం
మహిళలు అపరిచితుల వ్యక్తులను నమ్మొద్దు
జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి[/ads_color_box]

Target women who drink their eyes
విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరచిన ఎస్పీ

జాతరులు, తిరుణాలలో అక్కడికక్కడే పరిచయం చేసుకుంటూ వారిని నమ్మించి మాయమాటలు చెప్పి మహిళలను మోసగిస్తే నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి రహస్యంగా గుట్టుగా హత్యలు చేసి వారి వంటిపై ఉన్న ఆభరణాలను దోచుకునే గుట్టు హత్యల హంతకుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి విలేకరులకు తెలిపారు. నిందితులను విలేకరుల ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ ఈనెల 17వ తేదిన దేవరకద్ర పోలీసు స్టేషన్‌లో యండి అజిమొద్దిన్‌ ‌ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో డోకూర్‌ ‌వద్ద అనుమానిత మహిళ మృతదేహం లభ్యం కావడంపై పోలీసులు విచారణ చేపట్టగా ఎరుకలి శ్రీను, అతని భార్య ఇద్దరు కలసి మాయమాటలతో నమ్మించి వారిని దూర ప్రాంతాలకు తీసుకెళ్లి నిర్మానుష ప్రదేశాలలో వారిని మత్తులోకి దించి అనంతరం వారి గొంతును నులిమేసి వారివంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్తున్నాడని జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు.

కేసుకు సంబంధించి విచారణను ప్రత్యేకంగా లోతుగా దర్యాప్తు చేయగా ఇతడిపై గతంలో నాలుగు కేసులు ఉన్నాయని, అందులో రెండు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు సంబంధించి కేసులు ఉన్నాయని తెలిపింది. ఇతని టార్గెట్‌ ‌కల్లు సేవించే మహిళలే అని, కల్లు సేవించే మహిళలతో ఇతను మమేకమై మాయమాటలు చెప్పి వారిని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి మత్తులోకి దించాక వారిని చంపేయడం, అనంతరం వారి వద్దనున్న సొమ్మును కాజేయడం ఇతని వృత్తి అని, విచారణలో ఒప్పుకున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఎరుకలి శ్రీను భార్య ఎరుకలి సాలమ్మ కూడా సహకరిస్తుందని తెలియడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అపరిచితుల వ్యక్తులను నమ్మి మోసపోరాదని ఎస్పీ తెలిపారు. ఇటువంటి కేసులు పునరావృతం కాకుండా కల్లు దుకాణాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మహిళలు ఇతరుల నుండి ఇబ్బందులకు గురవుతున్న సమయంలో 100కు డయల్‌ ‌చేయాలని తెలిపారు. నిందితుడు దేవరకద్ర, భూత్పూర్‌, ‌కొత్తకోట, మిడ్జిల్‌ ‌పోలీసు స్టేషన్‌ ‌పరిధిలో నేరాలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. నిందితుల పట్టివేతలో కృషి చేసినటువంటి ఇన్‌స్పెక్టర్‌ ‌బి.కిషన్‌, ‌దేవరకద్ర ఎస్‌ఐ ‌వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు జాకీర్‌, ‌వెంకటేష్‌లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ శ్రీధర్‌లు పాల్గొన్నారు.

Tags: murderer, ‌ guttu, ‌ serial killer, ‌ dsp sridhar, ‌ sp rema rajeswari

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply