పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం
మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్ కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. బిజెపి గెలుపు ఆపలేరని ఆ పార్టీ నేతలు ప్రచారంలో చెబుతున్నారు. రాజోగపాల్ కూడా మళ్లీ తనదే గెలుపని అంటున్నారు.
ఈ దెబ్బతో టిఆర్‌ఎస్ పని అయిపోయిందని పార్టీ నేతలు కూడా తమ ప్రచారంలో చెప్పారు. ఇక బిజెపికి గుణపాఠం చెప్పబోతు న్నామని టిఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఈ రెండు పార్టీలకు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. మొత్తంగా గత నెలరోజులుగా మునుగోడులో హోరెత్తించిన మైకులు నేటి సాయంత్రం మూగబోనున్నాయి.