Take a fresh look at your lifestyle.

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు వెయ్యికి పైగా గ్రామాలు ఉన్నాయి. 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఐదుసార్లు, భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగుసార్లు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఒకసారి ఈ సెగ్మెంట్‌ ‌నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. తీవ్రమైన ఫ్లోరైడ్‌ ‌సమస్యను ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఫ్లోరైడ్‌ ‌సమస్య ఒక్కటే కాకుండా తాగునీరు మరియు సాగునీరు సమస్య కూడా ఈ ప్రాంత ప్రజలను మరియు రైతాంగాన్ని తీవ్రమైన నష్టాలకు గురిచేసింది.

ఇలాంటి తరుణంలో ఎన్నో రాజకీయ పార్టీలు మరియు రాజకీయ పార్టీ నాయకులు ఈ ప్రాంత ప్రజలను విస్మరించడం మూలంగా ఈ మునుగోడు ప్రాంతం మరో పాలమూరు గా మారింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న మునుగోడు ప్రజలకు వారి భావాలను వ్యక్తపరచడం కోసం 2022లో జరిగే ఉప ఎన్నిక వేదిక కానున్నది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ ‌రెడ్డి పై దాదాపు 20 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. కొన్ని అవాంఛనీయమైన సంఘటనల మూలంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల తనకు లబ్ధి చేకూరాలని స్వార్థం కోసం రాజగోపాల్‌ ‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం మూలంగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

భూ పోరాటాలకు విప్లవ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న మునుగోడు ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు చైతన్యవంతమైన ఆలోచన పరిజ్ఞానంతో తమ సమస్యలను తీర్చుకునే విధమైనటువంటి తీర్పు ఇవ్వాలని… ఈ తీర్పు కోసం యావత్‌ ‌భారతదేశం మునుగోడు ప్రజల వైపు చూస్తుంది. ఇలాంటి తరుణంలో రాజకీయ నాయకుల ఉచిత హామీ అనే వలలలో ఈ ప్రాంత ప్రజలు చిక్కుకోకూడదని వీరి తీర్పుతో పాలకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకు, అధికార దాహంతో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు తమ తీర్పు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని. ఈ ప్రాంత చైతన్యాన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు యావత్‌ ‌భారతదేశానికి తెలియజేయాల్సిందిగా మునుగోడు ప్రజలను మనసారా కోరుకుంటున్నాను.
– రాగిపని.బ్రహ్మచారి, కాకతీయ విశ్వవిద్యాలయ

Leave a Reply