- సిరిసిల్లలో రెబల్స్ గెలవడం సిగ్గుచేటు
- బిజెపి ఎక్కడుందన్న ఆయనకు ఫలితాలే నిదర్శనం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా।। లక్ష్మణ్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబల్స్ గెలవటం సిగ్గుచేటు అని అన్నారు. ఏకపక్షంగా మున్సిపాలిటీలను గెలుస్తామన్న కేటీఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదన్న కేటీఆర్.. గద్వాల, నిజామాబాద్, భైంసా,ఆమనగల్ తదితర ప్రాంతాలకు వెళ్లి చూస్తే బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ డియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఎదుర్కొని బీజేపీ నిలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు.
మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో నాలుగు వార్డులు గెలిచామని అన్నారు. ఇంట గెలవని కేటీఆర్ రచ్చ గెలవటం కల అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఒంటరిగా 85 శాతం స్థానాల్లో పోటీ చేయటమే తమ మొదటి విజయం అని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్‌కు నాంది అని పేర్కొన్నారు. ఎక్కువ చైర్మన్ పదవులు రాకపోయినా వార్డులు గెలవటం సంతోషంగా ఉందన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Tags: trs party rebels, Municipal polls slap, KTR, says State BJP President, Laxman, sirisilla