మిరుదొడ్డి(సిద్ధిపేట), జనవరి 17 (ప్రజాతంత్ర విలేఖరి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక పోలీస్ స్టేషన్‌ను, లచ్చపేట మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ శుక్రవారం సందర్శించారు. సిఐ హరికృష్ణ, ఎస్ఐ స్వామిని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన భద్రత గురించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకుగాను పోలీస్ అధికారులు చేపట్టాల్సిన ముందస్తూ ప్రణాళికలపై ఎన్నికల నిర్వహణలో భాగంగా సంబంధిత అధికారులు దుబ్బాక పట్టణంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎన్ని పోలింగ్ బూతులు, పోలింగ్ స్టేషన్ల రూట్లతో పాటుతో మొదలైన వివరాలను తెలిసి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావలసిన సౌకర్యాలు మున్సిపల్ అధికారుల సమన్వయంతో కలసి ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతీ ఒక్క పోలీస్ అధికారి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని. ఎలక్షన్‌కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, లేక ఫిర్యాది వచ్చినా వీడియోగ్రాఫ్, సిసి కెమెరా పుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలనీ, అధికారులందరూ చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ బూత్‌లను ఎల్లపుడు సందర్శిస్తూ, అక్కడి స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండా)న్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అందరూ అప్రమత్తంగా ఉండాలని, శాసనసభ, లోకసభ, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కేసులు నమోదైన వ్యక్తులను బైండోవర్ చేయాలని సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను ఒక వార్డులో కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైన నందున 19 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించబడుతాయన్నారు. గత ఎన్నికల్లో కేసులు నమోదైన , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని మున్సిపల్ ఎన్నికల పరిధిలో ఉన్న వారిని (63) మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నర్సయ్యకు సూచించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గార్డ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సిపి జోయల్ డేవిస్ స••చించారు.
Tags: Municipal elections,Administer,siddipet,CI Harikrishna