Take a fresh look at your lifestyle.

రెబల్స్ ‌దారికొస్తున్నారు: డియా చిట్‌చాట్‌లో కెటిఆర్‌

Municipal elections, taking challenge, ktr diya chitchat, kolluru

  • మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గానే స్వీకరిస్తున్నా
  • రెబల్స్ ‌దారికొస్తున్నారు..
  • కాంగ్రెస్‌, ‌బిజెపిలవి డ్రామాలు – డబుల్‌ ఇళ్లపై విమర్శలు అర్థరహితం
  • సిఎం అవుతారన్న ప్రచారంలో అర్థం లేదు – జిహెచ్‌ఎం‌సిని విడగొడితేనే మంచిది: డియా చిట్‌చాట్‌లో కెటిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌మున్సిపల్‌ ఎన్నికలను తాను సవాల్‌గానే స్వీకరిస్తున్నానని టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌,‌మంత్రి కెటిఆర్‌ అన్నారు.ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే అంతిమ విజయమన్నారు. తాను సిఎం అవుతాననే వార్తలను మరోమారు ఖండించారు. కావాలనే డియా వారు మంత్రులతో మాట్లాడిస్తున్నారని అన్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా మంత్రి కేటీఆర్‌ ‌శుక్రవారం డియా సమావేశంలో చిట్‌ ‌చాట్‌ ‌చేశారు. సిఎం కెసిఆర్‌ ‌మనసులో అనేక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని దశలవారీగా అమలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎందుకు నిలపలేకపోయిందని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ కలసి పనిచేస్తూ పైకి డ్రామాలు అడుతున్నాయని ఆయన మండిపడ్డారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్‌, ‌బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదు. కొత్త మున్సిపల్‌ ‌చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ ‌వెలుగులు తీసుకవచ్చింది టీఆర్‌ఎస్‌. ‌రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్‌బండ్‌లు నిర్మాణం చేశాం. హైదరాబాద్‌ ‌చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు ఏమైనా తెచ్చారా అని మంత్రి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రూ.18 వేల కోట్లతో 2 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు మాపై విశ్వాసం ఉంది. సీఎం కేసీఆర్‌ ‌మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలున్నాయి. ఐదు రూపాయల భోజనాన్ని జానారెడ్డి తిని మెచ్చుకున్నారు. మున్సిపల్‌ ‌మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాలు వంటిదే. జీహెచ్‌ంఎసీ ఎన్నికలు సమయానికి జరుగుతాయన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలని… జీహెచ్‌ఎం‌సీని విభజించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శుక్రవారం డియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నాలుగేళ్లూ పట్టణాల అభివృద్ధిపై ఫోకస్‌ ‌చేస్తామని అన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టాన్ని అమలుచేయడమే తమ ముందున్న సవాల్‌ అని తెలిపారు. తమ పాలనపై బీజేపీ చార్జ్‌షీట్‌లు వేయడం కాదని…దేశంలో ఎన్ని నగరాలను స్మార్ట్‌సిటీలుగా మార్చారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలవి లోపల పొత్తులు..బయట డ్రామాలు అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ‌రెబల్‌ అభ్యర్థులకు బీజేపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కొల్లాపూర్‌ ‌రెబల్స్‌తో సహా అందరూ దారికొస్తరని అన్నారు. టికెట్‌ ‌రాలేదనే తమ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ ఉన్నందున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీపై నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎంఐఎంతో ఎప్పుడైనా కలిసి పోటీ చేశామా? అని ప్రశ్నించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలపై కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ తెలంగాణలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు… బీజేపీ పాలిత రాష్టాల్ల్రో కట్టారా అని సవాల్‌ ‌విసిరారు.

కిషన్‌రెడ్డి కొల్లూరు వస్తే ఎర్ర తివాచీ పరిచి డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను చూపిస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదని అన్నారు. కానీ ఏపీలో రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తోందని ఎందుకనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో మూడు రాజధానులు ఉండవచ్చునని సీఎం జగన్‌ ‌ప్రకటన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు జరగుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్‌ ‌సక్సెస్‌ఫుల్‌గా పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Tags: Municipal elections, taking challenge, ktr diya chitchat, kolluru

Leave a Reply