కోరుట్ల పుర ఎన్నికలకు నామినేషన్ గడువు నేటితో ముగిసింది కోరుట్ల పట్టణంలోని 33 వార్డులకుగాను నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎన్నికల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ, జాయింట్ కలెక్టర్ బి రాజేశం మున్సిపల్ కార్యలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు తెలియజేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు, స్వతంత్రులు తమ బలం ర్యాలీ ద్వారా నిరూపించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ ఇష్టదైవం, తల్లి తండ్రులకు నమష్కరించి తమ తమ ఇళ్ళనుండి తమ అనుయాయులతో కలసి నామినేషన్ వేసేందుకు ఉత్సాహంగా బయలుదేరారు.
చివరి రోజు కావడంతో అభ్యర్థులు, నాయకులు, ప్రజలతో కోరుట్ల రోడ్లన్ని రద్దీగా మారీ కొద్ద దూరం ట్రాపిక్కు అంతరాయం ఏర్పడింది. బిజేపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్ మాజి మున్సిపల్ చైర్మెన్ శీలం వేణు గోపాల్ ఆధ్వర్యంలో గురువారం పట్టణానికి చెందిన కలాల సాయిచంద్ 500 మంది కార్యకర్తలతో కలసి బిజేపిలో చేరాడు నేడు నామినేషన్ దాఖలు చేసిన వారిలో కోరుట్ల నియోజకవర్గ మాజి మున్సిపల్ చైర్మెన్ శీలం వేణు గోపాల్ అధికార పార్టీ టిఆర్ఎస్తో పాటు బిజేపి నాయకులు తమ నామినేషన్ ర్యాలీలో వార్డు ప్రజలతో బారీ ర్యాలీలు నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సంధర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు నేతృత్వంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags: municipal elections, nominations ended, returning officers, korutla