Take a fresh look at your lifestyle.

సత్తా చాటిన వైకాపా.. పలుచోట్ల ఏకగ్రావాలు

  • సత్తా చాటిన వైకాపా.. పలుచోట్ల ఏకగ్రావాలు..
  • ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు
  • 10న ఎన్నికలు..14న ఫలితాలు వెల్లడి

ఆం‌ధప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. చిత్తూరు కార్పొరేషన్‌ ‌పరిధలోని 50 డివిజన్లకు గాను 30 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది.

దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపా లిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ ‌పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 31 వార్డులు, ఎర్రగుంట్ల మున్సి పాలిటీ లోని 20 వార్డుల్లో 12 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా కర్నూల్‌ ‌జిల్లాలోని డోన్‌ ‌మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.

మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో, ఆదోని మున్సిపాలిటీలో 9 వార్డుల్లో, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఎమ్మెల్సీ రాజేందప్రసాద్‌ ‌నివాసం ఉండే 15వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పోటీ నుంచి టీడీపీ అభ్యర్థి నాగమణి వైదొలగడంతో ఈ వార్డు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరింది. తిరువూరు నగర పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ 2 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిద్దలూరు మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది.

రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులను, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ 9 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply