Take a fresh look at your lifestyle.

అధికార పార్టీలో మున్సిపల్స్ ఎన్నికల లొల్లి షురూ

Municipal Elections Lolli shuru in the ruling party
అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో వర్గ పోరు మొదలు

నాగర్‌కర్నూల్‌: ‌మున్సిపల్‌ ఎన్నికలలో అధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నవారు చాలా మంది ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకొని ఉన్న వారికి టికెట్లు రాకపోవడంతో కొన్ని చోట్ల సొంత కుంపటి పెట్టుకొని ముందుకు వెళ్లడానికి సిద్దమౌతున్నట్లు అధికారపార్టీ కి చెందిన నాయకులు కొందరు తెలిపిన సమాచారం ఆదారంగా నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాలోని కొల్లాపూర్‌ ‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మేల్యే బీరం హర్షవర్దన్‌ ‌రెడ్డిల మద్య గత కొంత కాలంగా ఆదిపత్య పోరు కొనసాగుతోంది.

తన మాటే శాసనం అనే రీతిలో జూపల్లి ముందుకు వెల్లాలని యెరీచి స్తుంటే, ఎక్కడికక్కడే బీరం ఎంఎల్‌ఏ ‌భీరం హర్షవర్దన్‌ ‌రెడ్డి అడ్డు పడుతున్నాడు. కొల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో జూపల్లి వర్గియులు, హర్ష వర్ధన్‌ ‌వర్గీయులు పోటీకి సిద్దమౌతున్నారు. జూపల్లి వర్గీయులు ఇప్పటికే నామినేషన్లు కూడ వేయడం జరిగింది.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు ఆల్‌ ఇం‌డియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ నుంచి సింహం గుర్తుతో నామినేషన్లు వేయడం జరిగింది. ఎమ్మేల్యే బీరం అనుచరులు మాత్రం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నుంచి నామినేషన్లు వేయడానికి సిద్దంగా వున్నారు. ఎమ్మేల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ‌బీఫాంలు తీసుకొని వచ్చిన తరువాత 20 వార్డులకు చెందిన అభ్యర్దులు సిద్దంగా వుండాలని బీరం కార్యకర్తలకు ఆదేశించిన్నట్లు తెలిసింది. జూపల్లి అనుచరులకు టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తన అనుచరులకే బీఫాంలు ఇవ్వనున్నట్టు తెలిసింది.

Tags: trs party, rebels, ts municipal elections 2020, cm kcr, congress party

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply