Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ఎన్నికలను నిలిపివేయలేం

షబ్బీర్‌ అలీ పిటిషన్‌పై హైకోర్టు స్పష్టీకరణ
రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల పక్రియ మొదలైన కారణంగా.. ఇప్పుడు నిలిపి వేయలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషనర్‌ ఇచ్చిన అభ్యర్థనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 7‌కు వాయిదా వేసింది. మున్సిపల్‌ ఎన్నికలు రద్దు చేయాలంటూ హైకోర్టులో  కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను దాఖలు చేశారు. కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

Leave a Reply