వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గెలవగానే అహంకారంతో విర్రవీగొద్దు పురపాలక, ఐటి శాఖ మాత్యులు కేటీఆర్‌

January 31, 2020

Municipal and IT minister ktr
కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పెద్ది, మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌

‌దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర పాలన సాగుతోందని పురపాలక, ఐటి శాఖ మాత్యులు కేటీఆర్‌ అన్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో గెలుపొందిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మున్సిపల్‌ ‌చైర్మన్లు, వైస్‌ ‌చైర్మన్లు, కౌన్సిలర్లతో కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిసినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతి థిగా హాజరై కేటీఆర్‌ ‌మాట్లాడార న్నారు. ఏ ఎన్నికలు వచ్చినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైవిద్యపరమైన పాలన మన రాష్ట్రంలో ఉందని అన్నట్లు చెప్పారు. గెలవగానే అహంకా రంతో విర్రవీగవద్దని సూచించా రన్నారు. ప్రతి సమస్యను స్థానిక ఎమ్మెల్యేల, ఎంపీల ద్వారా ప్రభు త్వ దృష్టికి తీసుకురావాలని కోరారన్నారు. చట్టాన్ని అతిక్ర మించకుండా బాధ్యతతో వ్యవహ రించాలనీ సూచించారన్నారు.

పచ్చదనం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిధులతో పాటు, విధులను కూడా ఈ మున్సిపల్‌ ‌చట్టంలో ప్రస్థావిం చబడ్డాయ న్నారు. ప్రతి చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్లు, కౌన్సిలర్లకు కచ్చితం గా శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. 75 గజాల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణం చేసుకోవచ్చు. 75 గజాల కంటే ఎక్కువ ఉంటే 21 రోజులలో అధికారులు అనుమతులు ఇవ్వాలి. అతిక్రమిస్తే అధికారులు, ప్రజలు కూడా ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి ఉంటుందని సూచించారని ఆయన తెలిపారు. అనంతరం నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌గుంటి రజిని, వైస్‌ ‌చైర్మన్‌ ‌మునిగాల వెంకట్‌ ‌రెడ్డి పాలకవర్గసభ్యులందరు పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్‌ని కలిశారు. వీరి వెంట టీఆర్‌ఎస్‌ ‌నాయకులు రాణా ప్రతాప్‌ ‌రెడ్డి, కామగోని శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌లెక్కల విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags: Sudarshan Reddy Narsampet MLA, ktr,TRS heroes Rana Pratap Reddy, Kamagoni Srinivas Goud, Vidyasagar Sarreddy