Take a fresh look at your lifestyle.

కార్మికులకు దుస్తులను పంపిణీ చేస్తున్న మున్సిపల్‌ ‌చైర్మన్‌

  • కార్మికుల సంక్షేమం కృషి చేస్తా మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌తొడుపునూరి చంద్రపాల్‌

‌మెదక్‌, ‌సెప్టెంబరు 3 (ప్రజాతంత్ర ప్రతినిధి): మున్సిపల్‌ ‌కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌తొడుపునూరి చంద్రపాల్‌ ‌హామీనిచ్చారు. గురువారం మెదక్‌ ‌మున్సిపల్‌ ‌కార్యాలయంలో మున్సిపల్‌ ‌కార్మికులకు రక్షణ దుస్తులను పంపిణీ చేయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ‌కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, వాటితో పాటు వారికి మౌళిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. మున్సిపల్‌ ‌కార్మికులు పట్టణాభివృద్ధి కోసం సకాలంలో స్పందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

కార్మికుల సంక్షేమమే మన సంక్షేమమని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన రహదారుల వెంట వ్యర్థాలను తొలగించి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నారని కొనియాడారు. వారికి మౌలిక సదుపాయాలతో పాటు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్యం తొలగించి మెదక్‌ ‌పట్టణ ప్రజలను కాపాడుతున్నారని, వారి కృషి హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీ‌హరి, కౌన్సిలర్లు నార్ల లక్ష్మీనారాయణగౌడ్‌, ‌రామగిరి శ్రీనివాస్‌, ‌వంజరి జయరాజ్‌, ‌భీమరి కిషోర్‌, ‌సమియొద్దీన్‌, ‌నాయకులు కాస్లపురం మధు, బి.మహేష్‌, ‌శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌వనిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply