Take a fresh look at your lifestyle.

నిందితుడు రాజుకోసం ముమ్మర గాలింపు

అణువణువూ గాలించేందుకు ప్రత్యేక బృందాలు
సైదాబాద్‌ ‌సింగరేణి కాలనీ నిందితుడు రాజు కోసం పోలీసులు హైవేలను జల్లెడ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైవేలపై పోలీసులు నాకా బందీ ఏర్పాటు చేశారు. సూర్యాపేట, విజయవాడ హైవేపై పోలీసులు గాలిస్తున్నారు. ఎల్బీ నగర్‌ ‌నుంచి లింక్‌ ఉన్న హైవేలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాలు ఆధారంగా ఎల్బీ నగర్‌లో అణువణువు గాలిస్తున్నారు.

ఫిబ్రవరిలో రాజును ఒక కేసు విచారణలో చైతన్యపురి పోలీసులు పిలిపించారు. అక్కడ పోలీసులు తీసిన ఫోటోనే ఇప్పుడు కేసులో కీలక ఆధారం. మొత్తం 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. టాస్క్ ‌ఫోర్స్, ‌సీసీఎస్‌, ఎస్‌వోటీ టీమ్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇకపోతే సైదాబాద్‌ ‌కేసులో సీసీ కెమెరాలనే నమ్ముకున్నారు పోలీసులు. గతంలో సీసీ కెమెరాలు తక్కువ ఉన్న సమయాల్లో హ్యుమన్‌ ఇం‌టెలిజెన్స్ ‌ద్వారా నిందితులను పట్టుకునే వారు. ఇప్పుడు టెక్నాలజీ పైనే ఎక్కువ ఆధార పడుతున్నారు. నిందితుడు ఫోన్‌ ‌కూడా వాడకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం మరింత ఆలస్యం అవుతుంది.

సీసీ కెమెరాల దృశ్యాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హ్యుమన్‌ ఇం‌టెలిజెన్స్ ‌ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో ఫోటోలను పట్టుకుని నిందితులను పట్టుకునే పోలీసులు…సైదాబాద్‌ ‌కేస్‌లో 5 రోజుల పాటు టెక్నికల్‌గా దర్యాప్తు చేసారు పోలీసులు. నిందితుడి వద్ద సెల్‌ ‌ఫోన్‌ ‌లేకపోవడంతో మళ్ళీ హ్యుమన్‌ ఇం‌టెలిజెన్స్‌నే నమ్ముకున్నారు పోలీసులు. నిందితుడి ఫోటోల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply