Take a fresh look at your lifestyle.

తౌక్తే తుపాన్‌తో ముంబయి, గుజరాత్‌ అలర్ట్

  • గుజరాత్‌లో తీరం దాటనున్న తుపాన్‌
  • ‌ముంబైల్‌లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు
  • ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల నిషేధం

దేశ పశ్చిమ తీర రాష్టాల్రను ’తౌక్తే ’ తుపాను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ’అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌ ‌వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ ‌జిల్లాలోని పోర్‌బందర్‌-‌మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, ‌మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుపాను ఉద్ధృతి దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసింది.

నగరవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఉదయం కొంతసేపు వర్షం కురిసింది. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు రంగంలోకి దిగాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముంబయితో పాటు ఠాణె, రాయ్‌గఢ్‌, ‌పాల్ఘర్‌ ‌జిల్లాల్లోనూ నేడు వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు. తౌక్తే తుపాన్‌ ‌ప్రభావం మహారాష్ట్రపై పడింది. తుపాన్‌ ‌వల్ల ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అం‌తర్జాతీయ విమానా శ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీవర్షాలు కురుస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.

- Advertisement -

ముంబైలో భారీ వర్షంతోపాటు గాలులు వీస్తుండటంతో సోమవారం మోనోరైలు సర్వీసులను నిలిపివేశారు. మత్స్యకా రులు చేపలవేట కోసం అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు.భారీవర్షం వల్ల బాండ్రా-వర్లీ సీ లింక్‌ ‌ను మూసివేస్తున్నట్లు బృహన్‌ ‌ముంబై మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని మున్సిపల్‌ అధికారులు సూచించారు. గుజరాత్‌ ‌రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటలకు తుపాన్‌ ‌తీరం దాటే అవకాశముండటంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు తుపాను ప్రభావంతో గుజరాత్‌ ‌ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున కోల్‌కతా, ఆంధప్రదేశ్‌ ‌నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు గుజరాత్‌ ‌వెళ్లాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం 126 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది మూడు వాయుసేన విమానాల్లో బయల్దేరివెళ్లారు.

మరోవైపు ఇప్పటికే గుజరాత్‌ ‌తీరంలో గంటకు 175 కిలోటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకే పోర్‌బందర్‌, ‌మహువా ప్రాంతాల మధ్య లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 25వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీ కోరారు. గోవా, ముంబయి తీరాలకు దక్షిణ దిశగా, గుజరాత్‌కు దక్షిణ ఆగేయ దిశగా 660 కిలోటర్లు, పాకిస్తాన్‌లోని కరాచీ తీరానికి ఆగేయంగా 810 కిలోటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

ఇది మరింతగా బలపడి రాగల 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 17వ తేదీ సాయంత్రం నాటికి గుజరాత్‌లోని పోరుబందర్‌ ‌మహువా (భావనగర్‌ ‌జిల్లా) ప్రాంతాల మధ్య 18వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశాలున్నాయని తెలిపారు. ఇదిలావుంటే ఈనెల 21వ తేదీ నాటికి నైరుతి (సౌత్‌ ‌వెస్ట్ ‌మాన్‌సూన్‌) అం‌డమాన్‌ అం‌డ్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లోకి ప్రవేశించనుంది. కేరళలోకి ఈనెల 31 నాటికి రుతుపవనాలు రానున్నాయి. జూన్‌ ‌మొదట వారంలో కేరళలోకి ప్రవేశించాల్సి ఉండగా కాస్త ముందుగానే నైరుతి రానుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply