Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతున్న.. కరోనా బాధితులు

  • విదేశాల నుంచి వస్తున్న వారితో విస్తరిస్తున్న వ్యాధి
  • రద్దీకి దూరంగా ప్రజలు
  • కోలుకున్న కరోనా తొలి బాధితుడు

దేశంలో మొత్తం 107 కరోనా కేసులు నమోదైన అయ్యాయి. రోజురోజుకూ విదేశాలనుంచి వస్తున్న వారితో వ్యాధి సంక్రమిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా 32 కేసులు వెలుగుచూడగా.. తరువాతి స్థానంలో కేరళ, కర్ణాటకలో ఉన్నాయి. దేశంలో బయటపడిన 74 కేసుల్లో 17 మన దేశానికొచ్చిన విదేశీ పౌరులవి కావడం, ఇక్కడ వ్యాధి లక్షణాలు బయట పడ్డవారు కూడా వ్యాధి తీవ్రత ఉన్న దేశాలనుంచి రావడం చూస్తే దీని అవసరమేమిటో తెలుస్తుంది. న్యూయార్క్‌లో వ్యాధి విస్తరణ వేగంగా వున్నదని గుర్తించాక అమెరికా సైతం ఈ మాదిరి చర్యలే ప్రకటించింది. యూరప్‌ ‌దేశాల నుంచి రాకపోకల కారణంగానే న్యూయార్క్‌లో అధికంగా వైరస్‌ ‌వ్యాపిస్తోందని గమనించడంతో యూరప్‌నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. ఐక్యరాజ్యసమితి తన ప్రధాన కార్యాలయాన్ని మూసేస్తున్నట్టు, వేరే దేశాలకు ప్రతినిధి బృందాలను పంపడం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. హార్వర్డ్ ‌యూనివర్సిటీ తరగతి గదుల్లో కాక ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతోంది. ఆ దేశంలోని చాలా రాష్టాల్రు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. వేయిమందికి మించి పాల్గొనే సభలూ, సమావేశాలను రద్దు చేశారు. అయితే వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, రోగగ్రస్తులుగా అనుమానం వచ్చినవారిని పరీక్షించేం యదుకు అవ సరమైన కిట్లు అందుబాటులో వుంచడం ఈ వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సూక్ష్మంలో మోక్షమన్నట్టు కొన్ని చిట్కాలతో అంతా సర్దుకుంటుందన్న భ్రమల్లోకి ఎవరూ జారకుండా చూడాలి.

అదే సమయంలో అనవసర భయాందోళనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దశలో దేశంలో జనసంచారం, ప్రజల ఆందోళనలు,ర్యాలీలపైనా కరోనా ప్రభావం పడింది. ఢిల్లీ అల్లర్లతో బాగా ప్రాచుర్యం పొందిన షాహీన్‌బాగ్‌ ఆం‌దోళనకు తెరపడింది. కరోనా కారణంగా ఇక్కడికి రావడానికి పెయిడ్‌ ఆర్టిస్టులు దూరంగా ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌ ‌బాగ్‌ ‌ప్రాంతంలో రెండు నెలలకుపైగా కొనసాగుతున్న ధర్నా ప్రదర్శన కరోనా ప్రభావంతో కళావిహీనంగా మారింది. ఒకప్పుడు వందలు,వేల మంది కనిపించిన చోట ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా లేకుండా పోయారు. ఇప్పుడక్కడ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తి న్యాయవాదులు పలకరించినా వారి మాటలను పెడచెవిన పెట్టి, వారి సూచనలను వినేందుకు సైతం నిరాకరించిన దరిమిలా జరిగిన ఆందోళనలో 57మందికి పైగా మరణించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ‌లాంటి అల్లర్లను ఆందోళనలను, ధర్నాలను, నిరసన ప్రదర్శనలను, రోడ్డు దిగ్బంధనాలను దేశంలోని పలుచోట్ల చేపట్టారు. ముంబాయి, భోపాల్‌, ‌లక్నో, నాగ్‌పూర్‌, అలహాబాద్‌, ఇట్లా అనేక నగరాలలో వేసిన టెంట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply