Take a fresh look at your lifestyle.

ఆర్మీచీఫ్‌గా నరవణెళి బాధ్యతల స్వీకరణ

భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవణెళి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ ‌రావత్‌ ‌స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ ‌నరవణెళి బాధ్యతలు స్వీకరించారు. భారత ఆర్మీకి నరవణెళి 28వ సైన్యాధిపతి. జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌తన 37 సంవత్సరాల సర్వీసులో వివిధ బాధ్యతలను నిర్వహించారు. శ్రీలంకలో ఇండియన్‌ ‌పీస్‌ ‌కీపింగ్‌ ‌ఫోర్స్ ‌లో కూడా మనోజ్‌ ‌ముకుంద్‌ ఒకడిగాపనిచేశారు. లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌నరవణెళి.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. పుణెలోని జనన ప్రబోధిని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను పుణెలోని నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడ, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ‌మిలటరీ అకాడలో పూర్తి చేశారు.

డిఫెన్స్ ‌స్టడీస్‌లో మాస్టర్స్ ‌డిగ్రీని చెన్నైలోని మద్రాస్‌ ‌యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండోర్‌లోని దేవీ అహిల్య విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్‌ ‌చేశారు. 1980లో తొలిసారిగా సిఖ్‌ ‌లైట్‌ ఇన్‌ఫాంట్రీ ఏడో బెటాలియన్‌లో నరవణెళి నియామకం అయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని రాష్టీయ్ర రైఫిల్‌లో కమాండెంట్‌గా, అసోం రైఫిల్స్‌లో ఇన్‌స్పెక్టర్‌గా జనరల్‌గా నరవణెళి సేవలందించారు. చైనాతో 4000 కిలోటర్ల సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ ‌కమాండ్‌ అధిపతిగా, శ్రీలంకలో ఇండియన్‌ ‌పీస్‌ ‌కీపింగ్‌ ‌ఫోర్ల్సోనూ, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2019 సెప్టెంబర్‌ ఒకటో తేదీన ఆర్మీ వైస్‌ ‌ఛీఫ్‌గా నరవణెళి నియామకం అయ్యారు. ఆయన అందించిన సేవలకు గాను విశిష్ట్ ‌సేవా మెడల్‌, అతి విశిష్ట్ ‌సేవా మెడల్‌లు నారావణెళిను వరించాయి. ఆయన భార్య వీణా నరవణెళి టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags: mukundh naravaneli, army chief, As commandant, Rashtriya Rifle in Jammu & Kashmir, General as Inspector in Assam Rifles

Leave a Reply