Take a fresh look at your lifestyle.

అం‌తరాలయంలోనే వైభవంగా రాములోరి తెప్పోత్సవం

  • నీటితొట్టిలో స్వామివారి హంసవాహనం
  • తెల్లవారుజామున వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాడు శ్రీస్వామివారి తెప్పోత్సవం అంతరాలయంలో అర్చకులు, వేదపండితులు సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం ఆలయం వద్ద ఉన్న యాగశాల దగ్గర నీటితొట్టెను ఏర్పాటు చేసి ఆ నీటి తొట్టెను స్వామివారిని హంసవాహనంపై కుర్చుండబెట్టారు. సాయంత్రం 3గంటలకే స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిపై కుర్చుండబెట్టి వేద మంత్రోత్సవాల మధ్య మంగళవాయిద్యాలతో స్వామివారిని నీటితొట్టె వద్ద ఏర్పాటు చేసిన హంసవాహనం వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక మంత్రోత్సవాల నడుమ స్వామివారిని హంసవాహనంపై కుర్చుండబెట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -

హంసవాహనంపై ఉన్న స్వామివారిని భక్తులు చూసితరించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు అనుమతి లేనప్పటికి వివిధ ఛానెల్‌ ‌ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని నిర్వహించారు. దీనితో భక్తులు హంస వాహనంపై ఉన్న స్వామివారిని కనులారా చూసి తరించారు. గత కొన్నేళ్ళుగా గోదావరి నదీ తీరాన నిర్వహించే తెప్పోత్సవాన్ని కొరోనా ప్రభావంతో అంతరాలయంలోనే నిరాడంబరంగా నిర్వహించారు. గోదావరి నదీ తీరంలో హంసవాహనం విహరిస్తున్న సమయంలో రంగురంగు విద్యుత్‌ ‌దీపాలు బాణాసంచా శబ్దాలతో స్వామివారి హంసవాహనం నదిలో విహరించేది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆలయంలోనే నీటి తొట్టెను ఏర్పాటు చేసి స్వామివారిని హంసవాహనంపై కుర్చుండబెట్టారు. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం దేవాదాయశాఖ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య, ఐటిడిఏ పిఓ మరియు ఇన్‌చార్జీ సబ్‌కలెక్టర్‌ ‌గౌతమ్‌ ‌పొట్రూ , ఏఎస్పీ డా. వినీత్‌, ‌దేవస్థానం ఇఓ బి.శివాజీ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తెల్లవారుజామున వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం : వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. స్వామివారి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోవిడ్‌ ‌నిబంధల ప్రకారం కేవలం రెండువందల మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. భక్తులు వొచ్చినప్పటికి కోవిడ్‌ ‌నిబంధనలు పాటించే విధంగా భక్తులకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కేవలం అర్చకులు వేదపండితులు కొద్దిమంది అధికారులతోనే ఉత్తర ద్వారదర్శనం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.

Leave a Reply