Take a fresh look at your lifestyle.

ఎంఎస్‌ఎంఈ ‌పరిశ్రమలకు భారీ ఊరట

  • 3లక్షల కోట్లతో పూచీకత్తు లేని రుణాలు
  • 12 నెలల మారిటోరియంతో అందజేత
  • స్వయంప్రతిపత్తిగల భారత్‌ ‌నిర్మించడమే లక్ష్యం
  • ఆగస్టు  వరకూ ఇపిఎఫ్‌ ‌ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పెంపు
  • ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

భారతదేశాన్ని స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ ‌డియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ఐదు మూల సూత్రాల ఆధారంగా ప్రధాని ప్రకటన చేశారన్నారు. దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం ఆధారిత భారత్‌ ‌లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలుగా పేర్కొన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ ‌సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సంక్షోభంలో కూరుకుపోయిన చిన్నమధ్యతరహా పరిశ్రమలకు 3లక్షల కోట్లను పూచీకత్తు లేని రుణాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా 12 నెలల మారిటోరియంతో ఈ రుణాలు అందచేస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ‌నిర్వచనం మారింది. నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ ‌చేస్తే అది మైక్రో ఎంటర్‌‌ప్రైస్‌ ‌కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ ‌చేస్తే అది స్మాల్‌ ఎం‌టర్‌‌ప్రైస్‌ ‌కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడి తో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ ‌చేస్తే అది డియం ఎంటర్‌‌ప్రైస్‌గా పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర, గృహ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్లు పూచీకత్తు లేకుండా రుణాలుగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈలోని ఉద్యోగులకు భద్రత కల్పించేందుకూ సైతం ఉపయోగకరమన్నారు. 12 నెలల వరకు రుణాలపై తిరిగి చెల్లింపులు చేయనక్క ర్లేదన్నారు. ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పనచేసినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ భారత్‌ ‌స్వావలంబన సాధించేందుకు ఉపయోగపడుతుందని, ఆమె పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన తర్వాత గరీభ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన కింద ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, అన్నివర్గాల ప్రజలను ఆదుకున్నామని అన్నారు.

రెండో ప్యాకేజీ స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడానికి, అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంతోదోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ, ప్రజలు, డిమాండ్‌ ఐదు అంశాల ఆధారంగా నిర్భర్‌ ‌భారత్‌ ‌మిషన్‌ ‌చేపట్టామని తెలిపారు. గత 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. భారత్‌ ‌స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన దార్శనికతను దేశం ముందుంచారన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాకే ప్రధాని ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలైన సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ ప్రభుత్వ సంస్కరణలకు మేలిమి ఉదాహరణ అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్‌ ‌స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఐదు మూలసూత్రాల ఆధారంగా ప్యాకేజీ రూపొందించామన్నారు. గడిచిన 40 రోజుల్లో పిపిఈలు, మాస్కుల తయారీలో వృద్ధి సాధించామన్నారు. కొన్ని వారాల పాటు సమాజంలో వివిధ వర్గాలతో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు మేలు జరిగిందని తెలిపారు. రూ.41 కోట్ల జన్‌ ‌ధన్‌ ‌ఖాతాల్లోకి రూ.52వేల కోట్లు బదిలీ చేశామన్నారు. దివ్యాంగులు, వృద్దాప్య పెన్షన్‌ ‌దారులకు అండగా నిలిచామన్నారు. రూ.14 లక్షల టాక్స్ ‌పేయర్స్ ‌లబ్ది పొందారని, రూ.18 వేల కోట్ల విలువైన ఆహారధాన్యాలు పంపిణీ చేశామన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ ‌సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలని చెప్పారు. సెక్టార్ల వారీగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆదాయపన్ను రిటర్నస్ ‌గడువు పెంపు 2019-2020ఏడాదికి సంబంధించిన ఆదాయపన్నుల రిటర్నస్ ‌గడువును నవంబర్‌ 30‌వ తేదీ వరకు పొడిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్‌ ‌తెలిపారు. అలాగే.. వివాద్‌ ‌సే విశ్వాస్‌ ‌పథకాన్ని డిసెంబర్‌ 31 ‌వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు రూ.90వేల కోట్ల నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌వెల్లడించారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రో ఫైనాన్స్ ‌కంపెనీలు, హౌసింగ్‌ ‌ఫైనాన్స్ ‌కంపెనీలకు రూ.30వేల కోట్ల నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిధిని రూ.25 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. రూ.5కోట్ల టర్నోవర్‌ ‌చేసే కంపెనీలు కూడా సూక్ష్మ పరిశ్రమల కిందకే వస్తాయని ఆమె పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలకు రూ.3లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.

టిడిఎస్‌ ‌పరిధి ఉద్యోగులకు ఊరట
టీడీఎస్‌ ‌పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్‌ ఉం‌ది. అలాగే 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకూ టీడీఎస్‌ ఉం‌ది. సంవత్సరానికి పది లక్షల రూపాయలకు మించి జీతం ఉన్న వారికి 30 శాతం టీడీఎస్‌ ఉం‌ది.ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టీడీఎస్‌, ‌టీసీఎస్‌ ‌రేటు తగ్గింపుతో పన్ను చెల్లించేవారికి రూ.50 వేల కోట్ల వరకు ప్రయోజనం చేకూరనుంది.

ఈపీఎఫ్‌ ‌చెల్లింపుదారులకు ఊరట
ఈపీఎఫ్‌ ‌చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. బిజినెన్‌, ‌వర్కర్ల ఈపీఎఫ్‌ ‌కంటిబ్యూషన్‌ను మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. ఇందుకోసం రూ.6,750 కోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు, ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఉద్యోగులు మరింత ఎక్కువ వేతనం ఇంటికి పట్టికెళ్లేలాచూడం, పీఎఫ్‌ ‌బకాయిల చెల్లింపులో యాజమాన్యాలకు ఉపశమనం కలిగించడం అనివార్యమని అన్నారు. ఆ కారణంగానే ఉద్యోగులు, యజమానాలు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్‌ ‌కంటిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నంచి 10 శాతానికి మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు చెప్పారు. అయితే సీపీఎస్‌ఈ, ‌రాష్ట్ర పీఎస్‌యూలు ఎంఎ•-లాయర్‌ ‌కంట్రిబ్యూషన్‌ ‌కింద 12 శాతం చెల్లింపు కొనసాగుతుందని తెలిపారు. పీఎం గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌ప్యాకేజీ కింద 24 శాతం ఈపీఎఫ్‌ ‌సపోర్ట్ ఉన్న వర్కర్లకు మాత్రం ఈ స్కీమ్‌ ‌వర్తించదని ఆమె చెప్పారు. ఈపీఎఫ్‌ఓ ‌కిందకు వచ్చే 6.5 లక్షల సంస్థలకు, 4.3 కోట్ల ఉద్యోగులకు ఈ పథకం వల్ల ఉపశమనం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆ ప్రకారం యజమానులు, ఉద్యోగులకు రూ.750 కోట్ల మేరకు లిక్విడిటీ సపోర్ట్ 3 ‌నెలల పాటు లభిస్తుందని నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొన్నారు.

ఆత్మనిర్భర భారత్‌ అం‌టే స్వయం ఆధారిత భారత్‌: ‌నిర్మల
ప్రధాని నరేంద్రమోదీ రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినపుడు ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌ ‌గురించి ప్రస్తావించారు. ఐదు మూల సూత్రాలుగా ప్రధాని మోదీ ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌ను ప్రకటించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. అసలు దీనికి అర్థమేంటని అందరూ అనుకుంటుండగా సీతారామన్‌ ‌దానిగురించి వివరించారు. అత్మనిర్భర్‌ ‌భారత్‌ అం‌టే స్వయం ఆధారిత భారత్‌ అని అన్నారు. గత కొంత కాలంగా మనదేశం సాధించిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్రాజెక్ట్ ‌తీసుకొస్తున్నామని ఆమె చెప్పారు. ఈ నినాదం దేశప్రజల్లో నూతనోత్తేజాన్ని ఇస్తుందన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తం చేసి భారత్‌ ‌స్వీయంగా ఎదగడమే ఈ ప్పాజెక్టు లక్ష్యమని ఆమె వివరించారు.

Leave a Reply