Take a fresh look at your lifestyle.

పెళ్లిళ్లకు ఎమ్మార్వో అనుమతి తప్పనిసరి

  • పెళ్లి వేడుకలో 50మందికి మాత్రమే అనుమతి
  • చావులో 20మందికి మించి  పాల్గొనరాదు
  • కరోనా వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కొరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెలలో ఎక్కువగా పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో వివాహ వేడుకలపై ఆంక్షలు విధించింది. పెళ్లిళ్లో వధువు, వరుడు తరపు బంధువులంతా కలిపి 50 కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు వివాహ వేడుకలకు ఎమ్మార్వో అనుమతి తప్పనిసరి చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద ఈ అధికారాలను తహశీల్దార్‌కు కట్టబెట్టింది.

శుభలేఖతో పాటు పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి ఆధార్‌ ‌కార్డులతో ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకుకోవాలి. వివాహం జరిగే ప్రాంతంలో కొరోనా కేసులు ఎక్కువగా ఉంటే.. అక్కడ పెళ్లికి అనుమతి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఎమ్మార్వో అనుమతి లేకుండా వివాహ వేడుక నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది కూడా వివాహ వేడుకలపై ఆంక్షలు విధించారు. కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అంత్యక్రియల్లో కూడా 20 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు. ఇప్పుడు కూడా అవే నిబంనధులు అమల్లో ఉన్నాయిి.

Leave a Reply