Take a fresh look at your lifestyle.

ఎం‌పీటీసీలను పశువుల్లా కొంటున్నారు

రాజకీయలను టీఆరెస్‌ ‌కమర్షియల్‌ ‌చేసింది
టీఆరెస్‌ అభ్యర్థిపై ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు
పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
అత్యాచారాలపై గాంధీభవన్‌లో నేతల సత్యాగ్రహ దీక్ష

‌తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బరితెగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న సిగ్గుకూడా లేకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి గాంధీభవన్‌లో ఉత్తమ్‌ ‌మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయాలను కమర్షియల్‌ ‌చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దిగజారి ప్రవర్తించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజామాబాద్‌ ఎం‌పీగా ఓడిపోయిన కవితని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టారని, లోకల్‌ ‌బాడీలో ఇతర పార్టీ నాయకుల కొనుగోళ్లు పరాకాష్టకు వెళ్ళిందని ఆరోపించారు. కొరోనాతో జనం అతలాకుతలం అయినా టీఆరెస్‌ ‌తన వికృత రాజకీయాలు మాత్రం మానుకోలేదని నిప్పులు చెరిగారు.

ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..టీఆరెస్‌ ‌చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండదా? అని ప్రశ్నించారు. టీఆరెస్‌ ‌పార్టీ నిజామాబాద్‌ ‌రిసార్ట్‌లో క్యాంప్‌లు నిర్వహిస్తోందని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోదా? అని అడిగారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా బృందాలను పంపి నిజామాబాద్‌లో తనిఖీలు నిర్వహించాలని కోరారు. స్థానిక నేతలను రిసార్ట్‌కి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్‌ ‌వ్యవహారంపై కేంద్రం ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామని, అవసరమయితే కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చారని రాములు నాయక్‌, ‌భూపతి రెడ్డిని డిస్క్వాలిపై చేశారని విమర్శించారు. లోక్‌ ‌సభలో ఓడిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో పెట్టారని, కేసీఆర్‌ ‌దగ్గర మార్కులు కొట్టేసేందుకు సూట్‌కేసులు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి, నిజామాబాద్‌ ‌కలెక్టర్‌లకు విజ్ఞపి చేసినా పట్టించుకోలేదని అన్నారు.

అత్యాచారాలపై గాంధీభవన్‌లో నేతల సత్యాగ్రహ దీక్ష
ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లో హాత్రాస్‌లో జరిగిన దళిత యువతి అత్యాచారం, దారుణమైన హత్య సంఘటనపై రాష్ట్రంలోని మొయినబాద్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ఇటీవలే జరిగిన అత్యాచాకాలు, హత్యలపై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు సత్యాగ్రహ దీక్ష చేశారు. ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షులు ఉతమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి బోసు రాజు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కుసుమ కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌, ‌మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంత రావ్‌, ఎమ్యెల్సి జీవన్‌ ‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, దామోదర్‌ ‌రాజా నర్సింహా, ఎమ్యెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ అంశాలపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ శాంతి యుతంగా, సత్యాగ్రహ దీక్ష చేసింది.

Leave a Reply