మీడియా ముందు వీడియోను ప్రదర్శించిన ఉత్తమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి,అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వోటు వేయాలని ఓటర్ల చేత టీఆర్ఎస్ నేతలు ప్రమాణం చేయించిన వీడియోను సోమవారం మిడియా ముందు ఉత్తమ్ ప్రదర్శించారు. ఈసందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అనైతికంగా ఓటర్ల చేత ప్రమాణం చేయింస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌కు ప్రమాణం చేయించిన టేపులు పంపించానని చెప్పారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘ నేతలను మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం బెదిరించారని.. స్వయంగా ఆ సంఘ నాయకులే తనకు చెప్పారన్నారు. వామన రావు దంపతుల హత్యను బ్రాహ్మణ సమాజం మరిచిపోలేదన్నారు. బ్రాహ్మనులను మి నేతలచేత చంపించి ఓటు అడగడాన్ని నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పట్టభద్రులు ఆత్మగౌరవంతో ఓటు వేయాలని కోరారు. ఇప్పటివరకు తండ్రి మోసం చేసిండు.. ఇప్పుడు నాది బాధ్యత అంటూ మోసం చేయడానికి కేటీఆర్ ముందుకు వచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చిన్నారెడ్డికి మంచి స్పందన వస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మండలిలో మన పక్షాన బలమైన వాయిస్ వినిపించగలడని గ్రాడ్యుయేట్లు భావిస్తున్నారని చెప్పారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చిన్నారెడ్డి ముందంజలో ఉన్నాడని పేర్కొన్నారు. 55 శాతం మంది ఓటర్లు చిన్నారెడ్డికి మద్దతు తెలుపుతున్నారని, మిగతా ఓటింగ్ శాతాన్ని ఇతర పార్టీలు పంచుకోబోతున్నాయన్నారు. ఉన్నత విద్యా వంతుడు, రాజకీయ అనుభవంతో ప్రభుత్వంపై పోరాడగలరని గ్రాడ్యుయేట్ ఓటర్లు భావిస్తున్నారని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు సమర్థ వంతంగా పనిచేయలేదన్నారు. అందుకే బీజేపీ అభ్యర్థికి ప్రచారంలో నిరసనలు ఎదురౌతున్నాయన్నారు.