Take a fresh look at your lifestyle.

అమరుల ఆత్మలు ఘోశిస్తున్నాయి..!

  నాగులు ఆర్తనాదాలు నిరుద్యోగ యువత గుండె చప్పుడు: ఎంపీ రేవంత్ రెడ్డి 

అసెంబ్లీ సమీపంలో నాగులు ఆత్మహత్యాయత్నం తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమ కాల ఆత్మబలిదానాలను గుర్తుకు తెచ్చిందన్నారు.నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉందన్నారు.శుక్రవారం రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి  అని , నాడు యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా… మొసలి కన్నీరా? అని అనుమానం వ్యక్తం చేశారు .

కేసీఆర్ తీరుతో బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోశిస్తున్నాయన్నారు.కేటీఆర్ సూటూబూటూ వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు .నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలని ,ఉపాధికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ సమస్యపై తక్షణ కార్యచరణ ప్రకటించాలని , కేసీఆర్ స్పందించకుంటే నిరుద్యోగ యువత తరఫున త్వరలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తానని హెచ్చరించారు.

Leave a Reply