Take a fresh look at your lifestyle.

పల్లె రహదారులపై ఎంపీ నామ ప్రత్యేక దృష్టి

  • మారుమూల గ్రామీణ రోడ్లకు  భారీగా ప్రతిపాదనలు
  • 61 గ్రామీణ రోడ్లకు 470.96  కిలో మీటర్ల మేర ప్రతిపాదనలు
  • రూ. 14.57 కోట్లతో 26.40 కిలో మీటర్ల మేర 4 రోడ్లు మంజూరు

పల్లె రహదారులపై ఖమ్మం పార్లమెంట్‌ ‌సభ్యుడు నామ నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా, మంత్రి కేటీఆర్‌ ‌దిశా నిర్ధేశంతో స్ధానిక ఎమ్మెల్యేల సమన్వయం, స్ధానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మారుమూల, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంపై ఎంపీ నామ ప్రత్యేక ప్రణాళికలు రచించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రోడ్లు లేక గ్రామీణులు పడుతున్న వెతల ఆయన స్వయంగా చూశారు. లోక్‌సభలో ఈ విషయమై పలు మార్లు లేవనెత్తారు. గ్రామీణ రోడ్ల మంజూరుకు సంబంధించి ఉన్న నిబంధనలు గురించి, మాట్లాడి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించి ఎటువంటి పరిమితులు విధించకుండా పెట్టిన అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ నామ లోక్‌సభలో కేంద్రంపై వత్తిడి తెచ్చారు. ఫలితంగా స్పీకర్‌ ఓం ‌బిర్లా స్పందించి, ఎంపీలకు సంబంధించి సాధ్యమైనన్ని ఎక్కువ రోడ్లను మంజూరు చేయాలని సంబంధిత శాఖా మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి కూడా స్పందించి, ఎంపీ నామ సూచించిన విధంగా పి.ఎం.జి.ఎస్‌.‌వై. రోడ్లు మంజూరులో ఎంపీలకే ప్రాధాన్యత ఇచ్చి, రోడ్లు, నిధులు మంజూరు చేయడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఎంపీ నామ కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావుతో పాటు పంచాయతీరాజ్‌ ‌శాఖాధికారులతో సమావేశాలు నిర్వహించి పి.యంజి.ఎస్‌.‌వై. పథకం కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ రోడ్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 61 రోడ్లకు 470.96 కిలో మీటర్ల మేర ప్రతిపాదనలను పంచాయతీరాజ్‌ ‌శాఖకు పంపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 10 రోడ్లకు సంబంధించి 78.25 కిలో మీటర్లు, కొత్తగూడెం 12 రోడ్లకు సంబంధించి 78.09 కిలో మీటర్లు, మధిర 78.76 కిలో మీటర్లకు సంబంధించి 10 రోడ్లకు ప్రతిపాదించారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో 74.69 కిలో మీటర్లకుగాను 10 రోడ్లకు, వైరా నియోజకవర్గంలో 82.13 కిలో మీటర్లకు గాను 11 రోడ్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 79.04 కిలో మీటర్ల మేర 8 రోడ్లకు ప్రతిపాదనలు పంపారు. ఇటివల జరిగిన జిల్లా సాధికార కమిటీ సమావేశంలో రూ. 14. 57 కోట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26.40 కిలో మీటర్ల మేర నాలుగు రోడ్లకు మంజూరీ లభించింది. పిఎంజిఎస్‌వై పథకం – 3 , బ్యాచ్‌ – 1 ‌కింద ఈ రోడ్లు మంజూర య్యాయని ఎంపీ చెప్పారు. తాజాగా మంజూరైన వాటిలో అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండు రోడ్లు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ ‌సమన్వయంతో ఒక రోడ్డు, కొత్తగూడెం నియోజకరవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమన్వయంతో మరొక రోడ్డు మంజూరైందన్నారు. హైవే నుంచి దమ్మపేట వయా అర్బన్‌ ‌కాలనీ వరకు రూ.2 కోట్ల 29 )క్షల 52 వేల విలువైన 3.82 కిలో మీటర్ల మేర రోడ్డు మంజూరైంది. కొమ్ముగూడెం పిడబ్ల్యుడి రోడ్డు నుంచి అనంతారం వయా గోపతండ, కాకర్ల వరకు రూ.3 కోట్ల 94 )క్షల 25 వేల విలువైన 7.50 కిలో మీటర్ల రోడ్డు మంజూరైంది. అలాగే ములకలపల్లి ప్రభుత్వ ఆఫీసు నుంచి మొగురాలగుప్ప వయా మొండివర్రె, మూకమామిడి వరకు 4 .18 కిలో మీటర్ల మేర రహదారి నిర్మించేందుకు రూ.1 కోటీ 74 లక్షల 56 వేలు మంజూరయ్యాయని ఎంపీ తెలిపారు. మారు మూల ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు మరిన్ని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వాలకు నివేదించా మని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారు మూల గ్రామాలన్నింటికి రహదారి సౌకర్యం కల్పించ డమే తన లక్ష్యమని నామ నాగేశ్వరరావు తెలిపారు.

Leave a Reply