Take a fresh look at your lifestyle.

ఆక్సిజన్‌ ‌నిల్వలను సమకూరుస్తున్న ఎపి సర్కార్‌

ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు
ఆక్సిన్‌ ‌కొరత లేదన్న ఎంపి కృష్ణదేవరాయలు

కొవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ ‌నిల్వలను సమకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌ ‌గ్యాస్‌ ఏజన్సీల నుంచి ఆక్సిజన్‌ ‌కొనుగోలు చేస్తోంది. చెన్నై నుంచి గన్నవరం మండలం సూరంపల్లి ప్రైవేట్‌ ‌గ్యాస్‌ ఏజెన్సీకి 23 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌తరలివచ్చింది. సదరు ఏజెన్సీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఖమ్మం జిల్లాకు ఆక్సిజన్‌ ‌తరలించాల్సి ఉంది. అయితే రాష్ట్రానికి అందించాలని నిర్వాహకుడికి ఏపీ ప్రభుత్వం విన్నవించింది. సదరు ఏజెన్సీ నిర్వహకుడి నుంచి రాష్ట్ర అవసరం దృష్ట్యా 13 మెట్రిక్‌ ‌టన్నులను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ను గుంటూరు, విజయవాడ పరిసరాలలోని కొవిడ్‌ ఆస్పత్రులకు ప్రభుత్వాధికారులు తరలిస్తున్నారు.

మిగిలిన 10 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌కలిగిన ట్యాంకర్‌ను  తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ ఏర్పాట్లను సీఐ శివాజీ, తహసీల్దార్‌ ‌వనజాక్షి బృందం పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే ఆస్పత్రిలో కోవిడ్‌ ‌పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్‌, ‌రెమ్‌ ‌డెసివర్‌ ఇం‌జక్షన్‌, ‌మందులు అందుబాటులో ఉన్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మంగళవారం నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రిని ఎంపీ  శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పేషంట్‌ ‌వెంట వచ్చే సహాయకులు బయటే ఉండి సేవలు అందించే వైద్యులకు సహకరించాలన్నారు. ఇంకా ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బందిని త్వరలోనే భర్తీ చేస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కరోనా వస్తే భయాందోళనకు గురి కావద్దని చెప్పారు. ప్రభుత్వం కోవిడ్‌ ‌బాధితులకు అండగా ఉంటుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

Leave a Reply