Take a fresh look at your lifestyle.

కంది రైతులను ఆదుకోండి: పార్లమెంటులో ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్న

  • అధిక మద్దతుధర చెలిస్తున్నామన్న కేంద్రమంత్రి తోమర్‌ 

తెలంగాణలో కంది రైతుల సమస్య•పై క్రాస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్లమెంట్లో గళం విప్పారు. కంది రైతుల గోడు పట్టించుకోవాలన్నారు. అయితే కందులకు ఇప్పటికే అధిక మద్దతు ధర చెలిస్తున్నామని ఆయనకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2.07 లక్షల టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేసామని, నాఫెడ్‌, ‌ఫుడ్‌ ‌కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థల ద్వారా మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.కనీస మద్దతు ధరగా కింటాలు కందులకి రూ. 5800 చెల్లిస్తున్నామని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 125 రూపాయలు అధికంగా రైతులకు ఇస్తున్నాం అని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 47500 టన్నుల కందులు తెలంగాణా రైతుల నుండి కేంద్రం కొనుగోలు చేయాలని కోరితే. తాము సమ్మతించామని తెలిపారు.

ఫిబ్రవరి 22 సరికే కేంద్రం 45,500 టన్నుల కందులను సేకరించినట్లు మంత్రి తెలిపారు. పంట పెరిగినట్లు వచ్చిన తాజా అంచనాల మేరకు కందుల కొనుగోలు లక్ష్యం తాజాగా 51,625 టన్నుల కొనుగోలు కేంద్రం పెట్టుకున్నదని స్పష్టం చేశారు. పెరిగిన కొనుగోలు లక్ష్యం వల్ల రైతులకి మద్దతు ధర చెల్లిస్తూ కందులు కొంటున్నాం గనుక తెలంగాణ కందుల రైతులు లాభంలో ఉంటారని, తోమర్‌ అన్నారు.

Leave a Reply