Take a fresh look at your lifestyle.

రైతులు కష్టాలో ఉంటే టీఆరెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాల …ఎంపీ కోమటిరెడ్డి

ప్రజాతంత్ర ,హైదరాబాద్ : టీఆరెస్ పార్టీ పై కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.ఒకవైపు తెలంగాణరాష్ట్రలో అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాల పాలు అవుతుంటే టీఆరెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాటం సిగ్గుచేటని విమర్శించారు.అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ఈ మేరకు సోమవారం కోమటిరెడ్డి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనలో ఐకెపి,పీఏసిఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలల పంటను వర్షంపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేతనట్టు వ్యవహరిస్తోందని 15 రోజులుగా ఐకెపి,పీఏసిఎస్ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రభుత్వం చేతకాని తనం వల్లనే రైతులకు ఈ కష్టాలని ఆరోపించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చినందుకు రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు .అధికార పార్టీ ఎమ్మెల్యే లకు కాన్వాయిల తో ప్రచారం చేయటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని టీఆరెస్ పార్టీ కి ప్రచారం తప్ప సేవ చేసే తత్వం లేదని విమర్శించారు.వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఐకెపి,పీఏసిఎస్ కేంద్రాల వద్ద ధర్నా చేస్తామన్నారు .లాక్ డౌన్ కారణంగా అంతరాష్ట్ర ల ఎగుమతులు బత్తాయి ,నిమ్మకాయలు ,మామిడి నిలిచిపోయిన కారణంగా పండ్లను కొనుగోలు చేయటానికి ఎవరు రావటం లేదని కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల మామిడి, నిమ్మ, బత్తాయి పంట ఉంటుందని ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని కోరారు .మే 7 లాక్ డౌన్ తరువాత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఉద్యమం చేస్తానని అన్నారు .

Leave a Reply