నాకు పీసీసీ ఇస్తే రేవంత్ రెడ్డి విభేదించడు..శ్రీధర్ బాబుకిస్తే నాకభ్యంతరం లేదు : ఎంపీ కోమటిరెడ్డి
తాను పీసీసీ అడిగిన మాట వాస్తవమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనకు పీసీసీ ఇస్తే రేవంత్ రెడ్డి విభేదించడన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ… శ్రీధర్ బాబుకు పిసిసి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
చాలా సందర్భాల్లో తాను పిసిసికి అర్హుడని రేవంత్ స్వయంగా చెప్పారని, రేవంత్‌కు పిసిసి ఇచ్చినా తాను కలిసి పని చేస్తానని అన్నారు. జానారెడ్డి బీజేపీలో చేరాతరనేది అవాస్తవమని, ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడని, పార్టీ మారడని, నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.