Take a fresh look at your lifestyle.

రమేశ్‌ ‌కుమార్‌ ‌సంతకం ఫోర్జరీ విచారణ జరపాలని డిజిపికి ఎంపి ఫిర్యాదు

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. ‌రమేశ్‌ ‌కుమార్‌ ‌కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోమ్ శాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ సందర్భంగా రమేశ్‌ ‌కుమార్‌ ‌చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply