రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ ప్రకటించిన అధిష్టానం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించారు. యువతలో గట్టిపట్టున్న బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్తోనూ సత్సంబంధాలున్నాయి.
2018 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్ తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.