Take a fresh look at your lifestyle.

కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తే మరో ఉద్యమం

మహబూబ్‌నగర్‌, 12 ‌మే (ప్రజాతంత్ర ప్రతినిధి) : పోతిరెడ్డిపాడు కృష్ణ జలాలను ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రానికి తరలిస్తే దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నుండి మరో ఉద్యమం చేపడతామని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ జలాల తరలింపు జీవోను రద్దు చేసుకోవాలని మహబూబ్నగర్‌ ‌మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌ ‌రెడ్డి సీఎం కెసిఆర్‌  ‌పై ధ్వజ మెత్తారు మంగళవారం మహబూబ్నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చెప్పగానే మహబూబ్నగర్‌ ‌పేరు గుర్తుకు వస్తుందని ఉద్యమ సమయంలో సాగు తాగునీరు లేదని ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్‌ ‌డి ఎస్‌ ‌జూరాల ప్రాజెక్టు వద్ద ఎన్నో వాగ్దానాలు చెప్పి తిరిగి ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్తో అంతర్గత సమావేశాలు ఏర్పరచుకుని కుమ్మక్కై కృష్ణా జలాలను ఆంధ్ర తరలిస్తే ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నుండి దక్షిణ తెలంగాణ ఉద్యమం మొదలవుతుందని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం రెండు సంవత్సరాల ఆ సమయంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు సంబంధించి నార్లాపూర్‌ ‌వద్ద ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇప్పటివరకు అసలు ఇంటెక్‌ ‌పనులు ప్రారంభం కాలేదని ఆరు సంవత్సరాలు గడిచినా కోట్ల రూపాయలను మట్టిపాలు చేస్తున్నారన్నారు ఒకటిన్నర టీఎంసీల నీరు శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి ఇస్తామని కెసిఆర్‌ ‌చెప్పి అదనంగా అర టిఎంసిల నీటి తో కలిపి దిండి కి తరలిస్తామని నారు అలా చెప్పినాడు నల్గొండ జిల్లా నోట్ల మట్టి కొట్టారు.

నేడు 7 గంటల ముందు నీరు అందిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భూసేకరణలో ఎందరో రైతులు తమ భూములను కోల్పోయారని ప్రభుత్వం భయ్‌ ‌భ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి బలవంతంగా లాక్కోవడం తో రైతులు ఎన్నో దఫాలుగా ధర్నాలు చేపట్టాలని గుర్తు చేశారు జీవో వో నెంబర్‌ 203 ‌ప్రకారం విడుదల చేసిన నీటి పంపిణీ అంచనాలు పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడటం లేదన్నారు ఏపీ సీఎంతో కలిసి కెసిఆర్‌ ‌తెలంగాణకు నష్టం చేస్తున్నారన్నారు స్వలాభం కోసమే జగన్తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుమ్మక్కయ్యారని ఆరోపించారు

Leave a Reply